iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్ కు జ్యోతిరాదిత్య సింథియా రాజీనామా

కాంగ్రెస్ కు జ్యోతిరాదిత్య సింథియా రాజీనామా

మధ్యప్రదేశ్ కమల్ నాథ్ సర్కారుపై తిరుగుబాటు చేసిన జ్యోతిరాదిత్య సింథియా ప్రధాని మోడీతో భేటీ అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు.

Read Also: చిన్న రాజా మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నాడా?

18 ఏళ్లుగా కాంగ్రెస్ కోసం కస్టపడి పనిచేశానని, ఏడాదిగా కాంగ్రెస్ ను వీడాలని ఆలోచిస్తున్నానట్లు సింథియా తెలిపారు. ప్రజాసేవ చేయాలన్నదే తన లక్ష్యమని కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ప్రజలకు సేవ చేయడం సాధ్యం కావడంలేదని జ్యోతిరాదిత్య సింథియా పేర్కొన్నారు. అందుకే రాజీనామా చేస్తున్నట్లు జ్యోతిరాదిత్య సింథియా వ్యాఖ్యానించారు. జ్యోతిరాదిత్య సింథియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కారు సంక్షోభంలో పడటం ఖాయమని తెలుస్తుంది. జ్యోతిరాదిత్య సింథియా 17 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినందువల్ల మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే ప్రమామాదముంది.

జ్యోతిరాదిత్య సింథియా బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. 230 సభ్యులున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114 మంది, భాజపాకు 107 మంది సంఖ్యాబలం ఉంది. స్వతంత్ర సభ్యులు నలుగురు, బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇద్దరు, సమాజ్‌వాదీకి చెందిన ఒకరు ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. ఒకవేళ సింథియా వర్గం ఎమ్మెల్యేలు 17 మంది రాజీనామా చేస్తే కాంగ్రెస్‌ బలం 97కు పడిపోతుంది.