iDreamPost
android-app
ios-app

సుప్రీంకు చేరిన మధ్యప్రదేశ్ రాజకీయాలు

సుప్రీంకు చేరిన మధ్యప్రదేశ్ రాజకీయాలు

మధ్యప్రదేశ్ అసెంబ్లీని ఈ నెల 26 వరకూ స్పీకర్ ప్రజాపతి కరోనా వైరస్ కారణంగా చూపుతూ వాయిదా వేయడంతో బలపరీక్ష మరికొద్ది రోజులు వాయిదా పడింది. కాగా ఈరోజు మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించమని గవర్నర్ లాల్జీ టాండన్ స్పీకర్ కి సూచించిన విషయం తెలిసిందే. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌ లాల్జీ టాండన్‌ బలపరీక్ష తక్షణమే చేపట్టాలని స్పీకర్‌ను కోరారు. మరోవైపు సభను గౌరవించాలని కాంగ్రెస్‌ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేస్తుండగా సోమవారం బలపరీక్ష జరపాలని పట్టుపట్టిన గవర్నర్‌ అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.

కమల్ నాథ్ ప్రభుత్వం బలపరీక్ష నిర్వహించేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది మధ్యప్రదేశ్ బీజేపీ. గవర్నర్ బలపరీక్ష నిర్వహించమని ఆదేశాలిచ్చిన స్పీకర్ ఖాతరు చేయలేదని, 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినందున కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో బీజేపీ పేర్కొంది.

కాగా బలపరీక్ష జరిగే అవకాశం లేకపోవడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. తదనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు బలపరీక్ష జరిగేలా చర్యలు తీసుకోమని గవర్నర్ లాల్జీ టాండన్ ను కలిసి విజ్ఞప్తి చేసారు.. దానికి స్పందించిన గవర్నర్ రాజ్యాంగ హక్కులకు భంగం కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు.