iDreamPost
android-app
ios-app

స్పీకర్ కు.. ముఖ్యమంత్రి కి షాక్ ఇచ్చిన గవర్నర్

స్పీకర్ కు.. ముఖ్యమంత్రి కి షాక్ ఇచ్చిన గవర్నర్

మధ్యప్రదేశ్ లో కమలనాధ్ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో శాసనసభలో తమ బలం నిరూపించుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాధ్ కి గవర్నర్ లాల్జీ టాండన్ వార్నింగ్ ఇచ్చారు. లేనిపక్షంలో కమల్ నాధ్ ప్రభుత్వానికి బలం లేదని భావించాల్సి ఉంటుందని గవర్నర్ హెచ్చరించారు.

కాగా సోమవారంలోగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని లేఖ ద్వారా స్పీకర్ కు గవర్నర్ సూచించినప్పటికీ స్పీకర్ మాత్రం ఈ నెల 26 వరకు అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా వైరస్‌పై భయాందోళనలు వ్యక్తమవుతున్న దృష్ట్యా అసెంబ్లీని ఈ నెల 26 వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రజాపతి ప్రకటించారు. . దీంతో సీఎం కమల్‌నాథ్‌కు మరో పది రోజుల పాటు రిలీఫ్ దొరికినట్టైందని అందరు భావించినప్పటికీ, ఉదయం సభలో జరిగిన హైడ్రామా ముగిసింది అనుకుంటుగానే తాజాగా రేపటిలోగా సభలో తన బలం నిరూపించుకోవాల్సిందేనని గవర్నర్ ముఖ్యమంత్రిని ఆదేశించడంతో రేపు అసెంబ్లీలో ఎం జరగబోతుందోనన్న ఉత్కఠర సర్వత్రా నెలకొని వుంది.

మరోపక్క తక్షణమే శాసనసభలో బలపరీక్ష జరిపేలా స్పీకర్ ని ఆదేశించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించిన నేపథ్యంలో దీనిపై మంగళవారం మధ్యాహ్నం లోగా సుప్రీం కోర్ట్ డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే.