విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇటీవల గతాన్ని పూర్తిగా మరచిపోయినట్టు కనిపిస్తోంది. తన హయంలో సాగించిన వ్యవహారాలను ఆయన పూర్తిగా విస్మరించి మాట్లాడుతున్నారు. తనలానే అందరూ గతాన్ని మరచిపోవాలని ఆశిస్తున్నారు. చివరకు సినిమాల విషయంలో సైతం చంద్రబాబు తీరు దానికి అద్దంపడుతోంది. పవన్ కళ్యాణ్ పట్ల అవిభాజ్యప్రేమను చాటుతున్నట్టు భావించాల్సి వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సైతం ఆటంకాలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు పవన్ విషయంలో వత్తాసు పలకడాన్ని మంత్రి పేర్ని నాని కూడా ఎద్దేవా చేయాల్సి […]
నిన్న బుధవారం సినీ నటుడు, అభిమానులు ముద్దుగా యంగ్ టైగర్గా పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్ 37వ పుట్టినరోజు. లాక్డౌన్ ఉన్నా.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జూనియర్ పుట్టిన రోజును కేకులు కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు జూనియర్ ఎన్టీఆర్కు పుట్టిరోజు శుభాకాంక్షలు చెబుతూ ఫేస్బుక్, ట్వీట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులతో హోరెత్తించారు. కానీ తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా […]