sai
Devara Movie: యంగ్ టైగర్ జూనియర్ దేవర సినిమా నేడు విడుదల అయ్యి పొజిటివ్ టాక్ తెచ్చుకుంది. థియేటర్ల వద్ద అభిమానుల పండగ వాతారణం కనిపిస్తుంది.
Devara Movie: యంగ్ టైగర్ జూనియర్ దేవర సినిమా నేడు విడుదల అయ్యి పొజిటివ్ టాక్ తెచ్చుకుంది. థియేటర్ల వద్ద అభిమానుల పండగ వాతారణం కనిపిస్తుంది.
sai
నేడు సెప్టెంబర్ 27.. టాలీవుడ్ అభిమానులకు అసలైన పండగ రోజు. ఈ రోజుతో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన అభిమానులకు కనుల విందు కలిగింది. దేవర వచ్చేశాడు. థియేటర్లలో భీభత్సం చేస్తున్నాడు. ఎన్నో భారీ అంచనాలతో విడుదలయిన దేవర ఎర్లీ మార్నింగ్ షోతో కొంచెం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కానీ మ్యాటినీ షో నాటికి పొజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. తమ అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ థియేటర్లకు క్యూలు కట్టేస్తున్నారు. సెలెబ్రేషన్స్ ఓ రేంజిలో చేసుకుంటున్నారు. సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ కి పిచ్చెక్కి పోతున్నారు. ఇది పక్కా బ్లాక్ బాస్టర్ బొమ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
కానీ కొంతమంది అభిమానులకు మాత్రం నిరాశ కలిగింది. ఇక థియేటర్ల వద్ద దేవర హంగామా ఈరోజు ఉదయం 1 గంటకే మొదలైంది. చాలా థియేటర్లు బెనిఫిట్ షోలతో హౌస్ ఫుల్ అయిపోయాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం కొన్ని అనుకోని కారణాల వల్ల బెనిఫిట్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకి గురయ్యారు. ఖమ్మం ఏరియాలోని శ్రీ వెంకటేశ్వర థియేటర్ లో సాంకేతిక లోపాలు జరిగాయి. ఆ కారణంగా మధ్యాహ్నం షో ని ఆపేశారు. దీంతో తారక్ అభిమానులు తట్టుకోలేక పోయారు. తీవ్ర ఆగ్రహం చెందారు. ఈ క్రమంలో కోపంతో విధ్వంసం సృష్టించారు. రౌడీల్లా రెచ్చిపోయారు.
థియేటర్ యాజమాన్యంపై మండిపడ్డారు. బాధ్యత లేకుండా గొడవలు చేశారు. థియేటర్ ని ధ్వంసం చేశారు. ఆ థియేటర్ లోని ఫర్నిచర్, అద్దాలని పగలగొట్టి నానా రచ్చ చేశారు. వీరి ప్రవర్తన చాలా మందిని ఆందోళనకు గురి చేసింది. కొందరు గొడవలు పడి కొట్టుకున్నారు కూడా. అభిమానుల విధ్వంసాన్ని చూసిన కొందరు వ్యక్తులు ఆ భయానక దృశ్యాలని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంకా ఇదే కాకుండా కొన్ని చోట్ల అయితే ఎన్టీఆర్ కటౌట్లు తగలబెట్టడం, గొడవలు పడటం వంటి సంఘటనలు కూడా జరిగాయి. సినిమాని సినిమాలాగా చూడకుండా ఇలా రచ్చ రచ్చ చేస్తున్నారు కొందరు అభిమానులు. ఇలాంటి సంఘటనలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
#Devara Theatre Damaged ⚠️
Sri Venkateswara Theatre – Khammam (Telangana)
Due to a technical issue, the show got Cancelled, leading to unrest. Fans, in frustration, damaged the entire theatre, breaking glass, chairs, the projector room, and even the canteen.
Such a huge loss… pic.twitter.com/chNUtMAMsq
— Milagro Movies (@MilagroMovies) September 27, 2024