iDreamPost
android-app
ios-app

Kantara-2: కాంతార ప్రీక్వల్ లో NTR? ధియేటర్స్ షేక్ అయ్యే న్యూస్!

  • Published Mar 08, 2024 | 3:50 PM Updated Updated Mar 08, 2024 | 3:50 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతకాలం కిందట .. ప్రేక్షకులను భారీగా ఆకట్టుకున్న సినిమా "కాంతార". అయితే ఇప్పుడు ఈ సినిమాకు సిక్వెల్ వుండబోతుందనే టాక్ కూడా వినిపించింది. ఇక తాజాగా ఈ సినిమాలో నటించేందుకు టాలీవుడ్ లో ఓ ప్రముఖ హీరోను పరిగణలోకి తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతకాలం కిందట .. ప్రేక్షకులను భారీగా ఆకట్టుకున్న సినిమా "కాంతార". అయితే ఇప్పుడు ఈ సినిమాకు సిక్వెల్ వుండబోతుందనే టాక్ కూడా వినిపించింది. ఇక తాజాగా ఈ సినిమాలో నటించేందుకు టాలీవుడ్ లో ఓ ప్రముఖ హీరోను పరిగణలోకి తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

  • Published Mar 08, 2024 | 3:50 PMUpdated Mar 08, 2024 | 3:50 PM
Kantara-2: కాంతార ప్రీక్వల్ లో NTR? ధియేటర్స్ షేక్ అయ్యే న్యూస్!

ఇండియన్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ వద్ద .. ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్ వచ్చి.. థియేటర్స్ లో ఆడియన్స్స్ ను .. ఒక మంచి ఎక్స్పీరియెన్స్ ను ఇచ్చిన సినిమాలలో ఒకటి “కాంతార”. మొదట ఈ సినిమా కన్నడ భాషలో విడుదలైనప్పుడు .. ఈ సినిమా గురించి అంతగా టాక్ వినిపించలేదు . కానీ, ఒరిజినల్ భాషలో విడుదలైన వారం రోజుల తర్వాత ఈ మూవీని అన్ని భాషలలో విడుదల చేశారు. ఇక అప్పటినుంచి కాంతార సినిమాకు అంతటా భారీ హైప్ క్రియేట్ అయింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. కాంతార సినిమాలో హీరోగా కనిపించిన రిషబ్ శెట్టి.. ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించాడు. అయితే , ఇక ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార: చాప్టర్ 1 ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇపుడు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించేందుకు .. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ హీరోను పరిగణలోకి తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అయితే, కాంతార సినిమాలో..రిషబ్ శెట్టి హార్డ్ వర్క్ .. డెడికేషన్ చాలా క్లియర్ గా కనిపించాయని చెప్పి తీరాలి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ గా రాబోతున్న కాంతార: చాప్టర్ 1 లో.. కాంతారాలో కథలోని.. అంశాలను మరింత స్పష్టంగా చూపించబోతున్నారట. ఇక కొంతకాలం కిందట ఈ సినిమాకు ప్రీక్వెల్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. చూడబోతుంటే ఈ ప్రీక్వెల్ అంచనాలకు మించి ఉండబోతుందని అనిపిస్తోంది. అయితే, ఈ సినిమాలో కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ కూడా అందరిని ఆశ్చర్య పరిచేలా ఉంటాయట. ఈ స్పెషల్ రోల్స్ ను చేయడానికి .. స్పెషల్ ఆర్టిస్ట్ లను ఎంపిక చేసుకోనున్నారు. ఈ క్రమంలో .. కాంతార సినిమా దేశ వ్యాప్తంగా గుర్తింపు రావడంతో.. ఇందులో మిగతా భాషల్లోని నటినటులను కూడా సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కాంతార లో నటించేందుకు .. ఓ బడా హీరోను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఖచ్చితంగా థియేటర్స్ ను షేక్ చేసే న్యూస్ .. ఎందుకంటే, ఆ హీరో మరెవరో కాదు.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అనే వార్తలు గట్టిగా గుబాళిస్తున్నాయి.

తాజాగా కర్ణాటకకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ని అలాగే రిషబ్ శెట్టిని కలిశాడట. ఇక దీనిని బట్టి యితే తన ప్రాజెక్టుల కోసమే ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళాడని.. అలాగే కాంతార ప్రాజెక్టులో కూడా అతను ఒక భాగం కాబోతున్నాడనే .. వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ ను ఓకే చేశాడా లేదా అనే విషయం మీద అయితే క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ వినిపిస్తున్న వార్తల ప్రకారం ఎన్టీఆర్ కనుక ఈ ప్రాజెక్ట్ ను ఓకే చేస్తే.. ఖచ్చితంగా కాంతార సినిమాను మేజర్ గా ఇంపాక్ట్ చేస్తుందని చెప్పి తీరాలి. ఇక మరో వైపు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి, ఇప్పుడు కాంతారలో ఎన్టీఆర్ నటించబోతున్నాడు అని వినిపిస్తున్న వార్తలపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş