iDreamPost
android-app
ios-app

ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ.. KGF తో లింక్?

  • Published Nov 01, 2024 | 3:49 PM Updated Updated Nov 01, 2024 | 3:49 PM

తారక్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై అందరికి బారి అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

తారక్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై అందరికి బారి అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Nov 01, 2024 | 3:49 PMUpdated Nov 01, 2024 | 3:49 PM
ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ.. KGF తో లింక్?

ఎన్టీఆర్ వార్ 2 మూవీ అనౌన్స్ చేసినప్పుడు.. దేవర రిలీజ్ కాలేదు. ఫ్యాన్స్ లో ఎక్కడో కాస్తా కంగారు. ఏమౌతుందా అనే టెన్షన్. కట్ చేస్తే థియేటర్ లో బొమ్మ పడడం ఆలస్యం.. అన్ని టెన్షన్స్ పోయాయి. వచ్చిన రెస్పాన్స్ తారక్ కెరీర్ లో కొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. అందరికి తారక్ వరంగా మారాడు. ఇప్పుడు వార్ 2 లో కూడా హృతిక్ ఫేట్ మార్చేంత లెవెల్ కు రీచ్ అయింది. అలా ఇప్పుడు ఎన్టీఆర్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. మాస్ రూట్ లోనే తానూ ఎప్పుడు టచ్ చేయని పాత్రను చేస్తున్నాడు. ఇది కానీ క్లిక్ అయితే మాత్రం.. వందలు కాదు వేల కోట్ల వసూళ్లు కన్ఫర్మ్ అని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ లో కూడా తారక్ పాత్ర ఇలానే ఉండబోతోందనే టాక్ నడుస్తుంది. కొన్ని సినిమాలు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే.. క్యారెక్టర్స్ పవర్ వలన రిజల్ట్ పక్కా అనే నమ్మకాన్ని కలిగిస్తాయి. నీల్ ఎన్టీఆర్ మూవీ కూడా అలాంటిదే .

దేవర రూపంలో వచ్చి సౌత్ , నార్త్ మార్కెట్ ను ఒక ఊపు ఊపేసాడు . ఇప్పుడు కూల్ గా ముంబై లో వార్ 2 షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. తర్వాత ఎలాగూ ప్రశాంత్ నీల్ మూవీనే అనే సంగతి తెలిసిందే. ఆల్రెడీ దీనికి డ్రాగన్ అనే పేరు వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ ఒకే థీమ్ తో ఉంటాయని తెలిసిందే. దీనితో ఈ మూవీకి మాత్రం ఆ థీమ్ ఉండదనే క్లారిటీ వచ్చింది. KGF , సలార్ లతో యష్ , ప్రభాస్ లను ఓ రేంజ్ లో చూపించాడు ప్రశాంత్ నీల్. ఇక ఇప్పుడు రాక్షసబల్లి లాంటి పాత్ర పేరుతో వినిపిస్తున్న ఈ సినిమా కూడా.. అదే రేంజ్ లో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన తల్లిని తనకు దూరం చేసిన ఓ డాన్ పై.. రివెంజ్ తీర్చుకునే డ్రాగన్ లాంటి పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడట.  KGF 1 నుంచి దీనిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారట ప్రశాంత్ నీల్.

KGF పార్ట్1 లో తన తల్లి చనిపోతూ.. కొడుకును గట్టెక్కిస్తుంది. ఆ సీన్ అందరికి బాగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ మూవీలో అలానే కనిపించబోతున్నాడట. తన తల్లి తాలూకు కష్టాలకు రివెంజ్ తీసుకునే కొడుకుగా ఎన్టీఆర్ ఉండబోతున్నదనే టాక్ నడుస్తుంది. దీనితో ప్రేక్షకులలో కొత్త ప్రశ్నలు స్టార్ట్ అయ్యాయి.. KGF కి డ్రాగన్ కు ఏమైనా సంబంధం ఉందా! సలార్ స్టోరీ కూడా ఇందులో ఉండబోతుందా ! అసలు ప్రశాంత్ నీల్ ఏం ప్లాన్ చేసాడు! అనే సందేహాలు ఎక్కువయ్యాయి. అయితే ఇది కెజిఎఫ్ సలార్ ను కలిపితే వచ్చే అవుట్ పుట్ అంటూ మరి కొంతమంది భావిస్తున్నారు. మరో విషయం ఏంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పేరు ప్రహల్లద్ అనే బజ్ కూడా వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ.. సినిమాపై రోజు రోజుకు వినిపిస్తున్న టాక్ మాత్రం అంచనాలను పెంచేస్తుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet