iDreamPost
android-app
ios-app

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా ఇప్పట్లో లేనట్టే

  • Published Mar 13, 2024 | 10:36 AM Updated Updated Mar 13, 2024 | 10:36 AM

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాపై అభిమానులకు ఓ బిగ్ షాక్ తగిలింది. ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు.

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాపై అభిమానులకు ఓ బిగ్ షాక్ తగిలింది. ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు.

  • Published Mar 13, 2024 | 10:36 AMUpdated Mar 13, 2024 | 10:36 AM
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా ఇప్పట్లో లేనట్టే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ 2 వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడితో తమ అభిమాన హీరో సినిమా ఓకే అవడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆనందించారు. ఇక సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం మొదలుపెట్టారు. అయితే ఎన్టీఆర్ 31వ సినిమాగా రానున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు కూడా ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో దేవర అనే పాన్ ఇండియా చేస్తున్నారు. కాగా ఈమధ్యే ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

నిజానికి దేవర సినిమా మొదలైనప్పుడు రెండు భాగాలుగా విడుదల అవుతుందని ఎవరూ అనుకోలేదు. అయితే ఈ సినిమా కథాంశం చాలా పెద్దగా ఉంటుందని, మరిన్ని విజువల్ ఎలిమెంట్స్‌ని అందించేందుకు రెండు భాగాలుగా తీస్తామని దర్శకుడు కొరటాల శివ స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తీసిన “సలార్” కు కూడా సీక్వెల్ తెరకెక్కనుంది. ఈ రెండు సినిమాల సీక్వెల్ ప్లాన్స్ వల్ల ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా షెడ్యుల్/ప్లానింగ్ పూర్తిగా మారిపోయింది.

NTR-Prashanth Neel movie is like no more

దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ 2 తర్వాతనే ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఇటు వైపు దేవరను వీలైనంత త్వరగా పూర్తి చేసి నీల్ తో ఎన్టీఆర్ 31 స్టార్ట్ చేయాలనుకున్న ఎన్టీఆర్ కూడా ఇప్పుడు ప్లాన్ మార్చాల్సి వచ్చింది. అలానే హ్రితిక్ రోషన్ తో వార్ 2 కూడా వచ్చి చేరడంతో ప్రశాంత్ నీల్ సినిమా ప్రస్తుతానికి వెనక్కి వెళ్ళినట్లే అని అంటున్నారు. ఏప్రిల్‌లో ఎన్టీఆర్‌ వార్‌ 2 షూటింగ్‌ ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే, సలార్ 2 షూటింగ్ కూడా ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని ఆ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన పృథ్వీరాజ్, బాబీ సింహా వంటి నటీనటులు స్పష్టం చేశారు. ఇలా ఒక వైపు ఎన్టీఆర్… మరో వైపు ప్రశాంత్ నీల్ వేరే సినిమాలతో బిజీ కావడంతో ఎన్టీఆర్ 31 ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదు. మొత్తానికి ఒక క్రేజీ పాన్ ఇండియా సినిమా అనుకోకుండా ఇతర సినిమాల వల్ల లేట్ అవుతోంది. ఇది ఎన్టీఆర్ అభిమానులను కాస్త నిరాశపరిచేదే అయినా హీరో, డైరక్టర్ ఇద్దరూ బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించి ఆ తరువాత ఎన్టీఆర్ 31 సినిమా మొదలుపెడితే అప్పుడు ఆ సినిమాకి భారీ స్థాయిలో క్రేజ్ వస్తుంది అని ఆశిస్తున్నారు. మరి ఎన్టీఆర్ 31 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

ఎన్టిఆర్ 31: పాజ్ బటన్ నొక్కిన పాన్ ఇండియా సినిమా

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom