iDreamPost
android-app
ios-app

Tollywood: తారక్ అభిమనులకి బ్యాడ్ న్యూస్! దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్!

  • Published Oct 03, 2024 | 3:02 PM Updated Updated Oct 03, 2024 | 3:02 PM

Devara Movie: దేవర సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ క్రమంలో అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్ అయింది.

Devara Movie: దేవర సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ క్రమంలో అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్ అయింది.

  • Published Oct 03, 2024 | 3:02 PMUpdated Oct 03, 2024 | 3:02 PM
Tollywood: తారక్ అభిమనులకి బ్యాడ్ న్యూస్! దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ లేటెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘దేవర’ అదరగొడుతుంది. ఎక్కడ చూసినా దేవర హంగామా మామూలుగా లేదనే చెప్పాలి. మొదటి రోజు బెనిఫిట్ షోస్ నుండి ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ రెండో రోజు నుంచి టాక్ మారింది. మిక్స్డ్ టాక్ కాస్తా పాజిటివ్ టాక్ అయింది. వసూళ్లు పెరిగాయి. రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఒక్కో రికార్డుని నరుక్కుంటూ దేవర జనాల్లోకి వెళ్ళిపోయింది. ఫలితంగా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 300 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది. ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం దేవర కంటెంట్, అభిమానులు, ప్రేక్షకులు..

తనకు ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకుల ప్రేమకు జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా థాంక్స్ చెప్పారు. వారితో కలిసి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు అభిమానులకు గట్టి షాక్ తగిలింది. రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులు సరిగ్గా అనుకూలించలేదు. అందువల్ల ఈ రోజు జరగాల్సిన దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్ అయింది. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ తెలిపారు. దేవర మూవీని రెండు తెలుగు రాష్ట్రాలలో నాగవంశీ పంపిణీ చేశారు.
తాజాగా దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్ విషయం గురించి ఎక్స్ లో ట్వీట్ చేశారు.

నాగవంశీ తన ట్వీట్ లో.. “దేవర సినిమాకి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో తారక్ అన్న దేవర సక్సెస్ మీట్ చేసి ఫ్యాన్స్ తో మాట్లాడాలని అనుకున్నారు. మేము చాలా రకాలుగా ట్రై చేశాం కాని దసరా, దేవి నవరాత్రి వేడుకల కారణంగా రెండు రాష్ట్రాల నుంచి అనుమతి లభించలేదు. పరిస్థితులు సహకరించలేదు. వాటిని మార్చడం మా చేతుల్లో లేవు. అందుకే ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకు మేము క్షమాపణలు చెబుతున్నాము. అయినా సక్సెస్ మీట్ పెట్టడానికి మేము మళ్ళీ ప్రయత్నిస్తాము.” అని నాగ వంశీ తెలిపారు. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక దేవర సక్సెస్ మీట్ రద్దుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet