iDreamPost
android-app
ios-app

NTR సక్సెస్ కోసం నాగచైతన్య వెయిటింగ్! లెక్క వేరే ఉంది!

  • Author singhj Published - 05:26 PM, Sat - 11 November 23

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ హిట్టవ్వాలని నాగచైతన్య కోరుకుంటున్నారు. ఆ సినిమా సక్సెస్ కోసం చైతూ వెయిట్ చేస్తున్నారు. అయితే దీనికి లెక్క వేరే ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ హిట్టవ్వాలని నాగచైతన్య కోరుకుంటున్నారు. ఆ సినిమా సక్సెస్ కోసం చైతూ వెయిట్ చేస్తున్నారు. అయితే దీనికి లెక్క వేరే ఉంది.

  • Author singhj Published - 05:26 PM, Sat - 11 November 23
NTR సక్సెస్ కోసం నాగచైతన్య వెయిటింగ్! లెక్క వేరే ఉంది!

ఒకే ఒక్క సినిమాతో పాన్ వరల్డ్ ఇమేజ్​ను దక్కించుకున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నారు తారక్. కొమురం భీమ్ క్యారెక్టర్​లో ఒదిగిపోయి ఆయన ఎక్స్​ప్రెషన్స్ పలికించిన తీరు సూపర్బ్ అనే చెప్పాలి. ఈ మూవీలో రామ్ చరణ్-ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్లను ప్రేక్షకులు అంత సులువుగా మర్చిపోలేరు. ఒకరికి ఒకరు పోటీగా నటిస్తూ మూవీని నెక్స్ట్ లెవల్​కు తీసుకెళ్లారు. ఇందులో ‘నాటు నాటు’ పాటతో పాటు క్లైమాక్స్​ ఫైట్​ హైలైట్​గా నిలిచాయి. ఇక్కడి ఆడియెన్స్​తో అమెరికా, జపాన్ లాంటి దేశాల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ పెద్ద హిట్​గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫిల్మ్ తర్వాత చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి బిజీ అయిపోయారు.

స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్​లో బిజీ అయిపోయారు చరణ్. కానీ తర్వాతి ప్రాజెక్ట్ మొదలుపెట్టేందుకు తారక్ చాలా టైమ్ తీసుకున్నారు. ఎట్టకేలకు కొరటాల శివ డైరెక్షన్​లో ఓ మూవీకి ఆయన ఓకే చెప్పారు. ఆ సినిమానే ‘దేవర’. సముద్రం నేపథ్యంలో రూపొందుతున్న ఈ ఫిల్మ్​పై ఎక్స్​పెక్టేషన్స్ భారీ లెవల్లో ఉన్నాయి. ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా బ్యాక్ డ్రాప్​ చుట్టూ తిరిగే కథతో తారక్ మూవీ తెరకెక్కుతున్నట్లు టాక్. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు సమకూర్చుతున్న ‘దేవర’లో మలయాళ పాపులర్ యాక్టర్ షైన్ టామ్ చాకో కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్​గా రూపొందుతున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రాఫర్​గా వ్యవహరిస్తున్నారు.

సీ బ్యాగ్రౌండ్​లో టాలీవుడ్​లో సినిమాలు రావడం తక్కువే. తమిళ సినిమాల్లో ఈ తరహా కథలు ఎక్కువగా చూడొచ్చు. ఈ మధ్య కాలంలో తెలుగులో ‘ఉప్పెన’ ఇలాంటి నేపథ్యంతో వచ్చిన మూవీనే. కానీ ఆ చిత్రంలో లవ్ స్టోరీనే మెయిన్ ప్లాట్​గా తీసుకున్నారు. కానీ తారక్ ‘దేవర’లో కథ మొత్తం సముద్రం చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. మూవీ నుంచి బయటకు వచ్చిన తారక్, జాన్వీ కపూర్ లుక్స్ సినిమాపై మరింత ఎక్స్​పెక్టేషన్స్​ను పెంచుతున్నాయి. ‘దేవర’తో ఎన్టీఆర్ సూపర్ హిట్ అందుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అభిమానులే కాదు.. ఒక టాలీవుడ్ హీరో కూడా తారక్ ఫిల్మ్ సక్సెస్ కావాలని ఆశిస్తున్నారు. ఆ కథనాయకుడు మరెవరో కాదు.. అక్కినేని నాగచైతన్యే.

ఎన్టీఆర్ ‘దేవర’ హిట్టవ్వాలని నాగచైతన్య కోరుకోవడం వెనుక ఓ లాజిక్ ఉంది. డైరెక్టర్ చందూ మొండేటితో ఓ సినిమాకు కమిటయ్యాడు చైతూ. ఎన్సీ23 అనే వర్కింగ్ టైటిల్​తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బతుకుదెరువు కోసం గుజరాత్​లోని వీరవల్​ అనే ప్రాంతానికి వెళ్లి సముద్రవేట చేస్తూ పాకిస్థాన్ కోస్ట్​గార్డ్స్​కు చిక్కిన మత్స్యకారుల ఇతివృత్తం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం నాగచైతన్య రీసెంట్​గా శ్రీకాకుళం జిల్లాలోని కొంతమంది మత్స్యకారులను కలసి వాళ్ల లైఫ్ స్టైల్​ను తెలుసుకున్నారు. ఈ సినిమా కోసం బాడీని పెంచుతున్నారు. అలాగే లాంగ్ హెయిర్​తో కనిపిస్తున్నారు. ఎన్సీ23 కోసం నాగచైతన్య తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొత్త లుక్​తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

లుక్​తో పాటు పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేసి ఆడియెన్స్​ను థ్రిల్ చేయాలని నాగచైతన్య అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. చైతూ మూవీ, ఎన్టీఆర్ ‘దేవర’ రెండూ ఒకే థీమ్​తో తెరకెక్కుతుండటం గమనార్హం. అయితే తారక్ చిత్రం ఇప్పటికే చాలా మటుకు షూటింగ్ జరుపుకుంది. చైతూ సినిమా కంటే ముందే ‘దేవర’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మూవీ హిట్టవ్వాలని ఆయన కోరుకుంటున్నారని సమాచారం. ‘దేవర’ రిజల్ట్​ను బట్టి సీ బ్యాగ్రౌండ్ ఫిల్మ్స్​ను ఆడియెన్స్​ ఎలా ఆదరిస్తారో తెలుస్తుందని చైతూ అనుకుంటున్నారట. ఎన్టీఆర్ మూవీని బట్టే తన సినిమా ఎంత సేఫ్ అనేది తెలిసిపోతుందని.. కావాలంటే తర్వాత ఏమైనా మార్పుచేర్పులు చేసుకోవచ్చని ఆయన భావిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. మరి.. ఎన్టీఆర్ సినిమా హిట్టవ్వాలని చైతూ కోరుకోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రూ.1000 కోట్ల టార్గెట్ కోసం ముగ్గురు పోటీ! మొనగాడు ఎవరు?

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibommatbet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap