భారతదేశంలో పొడవైన ఉపనదిగా యమనకు పేరుంది. అనేక రకాలుగా ఈ నీటిని ప్రజలు తమ అవసరాలకు వినియోగిస్తున్నారు. హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, దిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాష్ట్రాల్లో విస్తరించింది యమన. ఇంత పెద్ద ఉపనదికి ఇప్పుడు కష్టమొచ్చింది. నీళ్ళు లేక అనేక ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందిపడుతున్న పరిస్థితి ఉంది. ఆనాడు శ్రీ కృష్ణుడు నడయాడిన యమున ఇప్పుడెలా ఉంది? వాతావరణ మార్పులు, పెరగుుతున్న ఉష్ణోగ్రతలతో వేసవిలో యమనా నది రోజురోజుకు ఎండిపోతోంది. వేసవిలో యమనా నదిలో నీరు తగ్గిపోతోంది. […]
కోవిడ్ మహమ్మారి మళ్ళీ విస్తరిస్తోంది. గత కొద్ది రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని గుర్తిస్తున్నారు. ఇందుకు సంకేతంగా కేసులు సైతం పెరుగుతూ ఉండటం ప్రజల్లో భయాందోళనల్ని కలిగస్తోంది. తాజాగా దిల్లీలో ఒక్కసారిగా కేసులు పెరుగుతూ రావడం కలవరపెడుతోంది. కేవలం 10 రోజుల సమయంలో దాదాపు 7 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేవలం నిన్న ఒక్క రోజే 1,375 కొత్త కేసులు వచ్చాయి. ఈ పెరుగుదలతో తప్పనిసరిగా మాస్కులతో పాటు నిబంధననలు సైతం పాటించాలని […]
కుదేలవుతున్న కాంగ్రెస్ కు కొత్త జవసత్వాలిచ్చేదెవరు? ఇప్పుడీ ప్రశ్న తెలంగాణలో అందరి మదినీ తొలుస్తోంది. వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో పార్టీ పగ్గాలు ఎవరు చేపడుతారా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక కోసం గట్టి కసరత్తే చేసింది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్ రాష్ట్రంలో పార్టీ పెద్దలందరితోనూ సంప్రదింపులు నిర్వహించారు. వేరు వేరుగా […]
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్ధికి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ స్కూల్ స్థాయిలొ విద్యా మరియు మౌళిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకుని రావాలనే లక్ష్యంతో సీఎం జగన్ ప్రతిష్టామకంగా అమలు చేస్తున్న “మన బడి నాడు నేడు” కార్యక్రమానికి ఇప్పటికే పలువురు ప్రశింశించగా, తాజాగా డిల్లీ డిప్యుటి సీఎం, ఆం ఆద్మీ పార్టి నేత మనీష్ సిసోడియా తన ఫేస్బుక్ ఖాతా నుంచి ముఖ్యమంత్రి జగన్ ని ప్రసంశిస్తూ సందేశాన్ని పొస్ట్ చేశారు. ఆగస్టులో రాష్ట్రంలో […]
తల్లడిల్లుతున్న ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ కరోనా టెర్రర్ తో తల్లడిల్లుతోంది. ఆప్ సర్కారును కుదిపేస్తోంది. రాజకీయంగా కూడా ఇది పెద్ద తలనొప్పిగా మారింది. మోదీ హోరు గాలిలోనూ విజయ కేతనం ఎగురువేసిన ఆప్.. ఇప్పుడు కరోనా కోరల్లో నలిగిపోతోంది. ఒక వైపు పెరుగుతున్న రోగులు… మరోవైపు ప్రతిపక్షాల విమర్శలు.. దీనికి తోడు సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ఆప్ సర్కారును కలవరపరుస్తున్నాయి. ఇప్పటి వరకూ పాజిటివ్ కేసుల సంఖ్య 42 వేలకు చేరువవుతోంది. దేశంలో నమోదైన కరోనా […]
బీజేపీ యువనేత జ్యోతిరాధిత్య సింధియాకు కరోనా సోకింది. ఇటీవల జ్యోతిరాధిత్య సింధియాకు కరోనా లక్షణాలు కనపడడంతో తల్లితో కలసి ఈ రోజు ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వారిద్దరికీ కరోనా నిర్థారణ పరీక్షలు చేసిన వైద్యులు ఇద్దరికీ వైరస్ సోకిందని నిర్థారించారు. మూడు ప్రత్యేక బృందాలు జ్యోతిరాధిత్య సింధియా, ఆయన తల్లికి వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనా అనుమానిత లక్షణాలతో ఈ రోజు నిర్థారణ పరీక్ష చేయించుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు నెగిటివ్ వచ్చింది. […]
ఢిల్లీలో ముఖ్యమంత్రి వర్సెస్ లెప్టినెంట్ గవర్నర్ మధ్య ఎప్పుడూ వివాదమే. అరవింద్ కేజ్రివాల్ పై అనిల్ బైజాల్ ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆయనపై ఎల్జీ కత్తి కట్టారు. ఎందుకంటే ఎల్జీ కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులతో నియామకం అయ్యారు. రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉంది. దాన్ని ఇరుకున పెట్టేందుకు కేంద్రం పనులన్నీ ఎల్జీ చేస్తారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తీసుకున్న కీలక నిర్ణయాలను ఎల్జీ అనిల్ బైజాల్ వ్యతిరేకిస్తున్నారు. అందుకే వీరిద్దరి […]
దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) రోజురోజుకూ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నది. కొన్ని రోజులుగా రోజుకు దాదాపు 10 వేలకు దగ్గరగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో పది రాష్ట్రాల నుంచే అత్యధిక కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్నది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 84 శాతం కేసులు ఈ పది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అలాగే, […]
ఢిల్లీలోని నిజాముద్దీన్లో గత మార్చి 13-17 మధ్యలో జరిగిన జమాతే మర్కజ్ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల నుంచి తబ్లిగీలు పాల్గొన్నారు. వీరితో పాటు భారత్కు పర్యాటక వీసాపై వచ్చిన కొంత మంది విదేశీ తబ్లిగీలు నిబంధనలకు విరుద్ధంగా జమాతే మర్కజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఢిల్లీ పోలీసుల విచారణలో వీసా నిబంధనల ఉల్లంఘన వెలుగు చూడటంతో ఢిల్లీ హైకోర్టుకు కూడా ఈ విషయం గురించి తెలియజేశారు.ప్రభుత్వ అనుమతి లేకుండా నిబంధనలను ఉల్లంఘించి మతపరమైన సమావేశంలో పాల్గొన్నందుకు దాదాపు 2550 మంది […]
భారత రాజ్యాంగంలోని అనేక అంశాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. అలాగే కేంద్ర జాబితాలోని అంశాలు కూడ తక్కవేం కాదు. రాష్ట్ర జాబితాలో కూడా అనేక అంశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ రాష్ట్ర జాబితా అప్రస్తుతం. ఎందుకంటే రాష్ట్ర జాబితా అంశాలు పూర్తిగా రాష్ట్ర పరిధిలోనే ఉంటాయి. కనుక రాష్ట్రానిదే నిర్ణయాధికారం. అయతే కేంద్ర, ఉమ్మడి జాబితాలకు సంబందించి అలా కాదు. కేంద్ర జాబితా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. నిర్ణయాధికారం కూడా కేంద్రానిదే. ఇటొచ్చి కేంద్రానికి, […]