iDreamPost
android-app
ios-app

వీడియో: పిల్లలు ఫోన్ వాడకుండా.. ఈ టీచర్ చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

పిల్లలు ఫోన్ వాడకుండా ఉండేందుకు ఓ టీచర్ చేసిన పని ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది. ఆ టీచర్ చేసిన పనికి అందరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే?

పిల్లలు ఫోన్ వాడకుండా ఉండేందుకు ఓ టీచర్ చేసిన పని ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది. ఆ టీచర్ చేసిన పనికి అందరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే?

వీడియో: పిల్లలు ఫోన్ వాడకుండా.. ఈ టీచర్ చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. తక్కువ ధరకే మొబైల్స్ వస్తుండడంతో కొనేందుకు వెనకాడడం లేదు. టెలికాం కంపెనీలు తక్కువ ధరలకే ఇంటర్నెట్ అందిస్తుండడంతో ఫోన్ వినియోగం పెరిగింది. కొందరి ఇళ్లలో ఒకటి కంటే ఎక్కువ ఫోన్లను కలిగి ఉంటున్నారు. స్మార్ట్ ఫోన్ మానవ జీవనశైలిని మార్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మొబైల్ జీవితంలో భాగమైపోయింది. ఫోన్ వాడకం అనివార్యమైపోయింది. చాలా వరకు పనులన్నీ ఫోన్ తోనే కనెక్ట్ అయి ఉంటున్నాయి. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్ లో గడిపే వారు ఎంతో మంది ఉన్నారు.

గంటలు గంటలు ఫోన్ తోనే కాలం గడుపుతున్నారు. పాటలు వింటూ, సినిమాలు చూస్తూ మొబైల్ స్క్రీన్ కు అంకితమైపోతున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఫోన్ మాయలో పడిపోతున్నారు. ఫోన్ వాడకం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ ఆ అలవాటును మాత్రం మానుకోవడం లేదు. ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల కంటి సమస్యలు, మతిమరుపు, మానసిక సమస్యలు, ఒత్తిడి ఇలా పలురకాల వ్యాధుల బారిన పడుతున్నారు. పెద్దలే కాదు పిల్లలు కూడా మొబైల్స్ ను తెగ వాడేస్తున్నారు. సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోయిన పిల్లలు కూడా చాలామందే ఉన్నారు. పిల్లల ఏడుపును ఆపేందుకు వారి చేతికి మొబైల్స్ ఇస్తున్నారు పేరెంట్స్.

Kids Video

పిల్లలు అన్నం తినకపోయినా ఫోన్ లో వీడియోలు చూపిస్తూ ఆహారం తినిపిస్తున్నారు. తమ పనులకు ఎలాంటి ఆటంకం కలగకూడదని కూడా పిల్లలకు ఫోన్లను అలవాటు చేస్తున్నారు. కానీ ఇది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తదని వారు తెలుసుకోలేకపోతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే తమ పిల్లల ఆరోగ్యాన్ని చేజేతులా ఇబ్బందుల్లోకి నెడుతున్నారు తల్లిదండ్రులు. ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్, అతినీలలోహిత కిరణాలు పిల్లల హెల్త్ పై పెను ప్రభావాన్ని చూపిస్తాయి.సెల్ ఫోన్ ను ఎక్కువగా చూసే పిల్లల్లో మాట్లాడటంలో ఆలస్యం, మానసిక వైకల్యం, గందరగోళం, ఆలోచనా లోపం, శారీరక శ్రమ తగ్గడం వల్ల ఊబకాయం, ఎముకల ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

పిల్లలు ఒక్కసారి ఫోన్ కు అలవాటు పడితే దాన్ని విడిచిపెట్టరు. ఒకవేళ బలవంతంగా లాక్కుంటే ఏడుపు లంకించుకుంటారు. మరి చిన్నపిల్లలు ఫోన్ కు దూరంగా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? మొబైల్ అంటేనే భయపడేలా చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.. ఓ స్కూల్ టీచర్ ఫోన్ అతిగా వాడితే ఏమవుతుందో తెలిసేలా ఓ ప్రాంక్ వీడియో చేసింది. ఇది చూసిన తర్వాత ఆ స్కూల్ పిల్లలు జీవితంలో ఫోన్ పట్టుకోవాలనే ఆలోచనను కూడా విరమించుకున్నారు. ఫోన్ ముట్టుకోవడానికి కూడా భయపడిపోయారు. ఇంతకీ ఆ స్కూల్ టీచర్ ఏం చేసిందంటే? ఢిల్లీలో ఒక ప్రైవేటు స్కూల్ లో పిల్లలు మొబైల్ లకు అడిక్ట్ అవుతున్నారు అని.. ఒక టీచర్ వినూత్న ఆలోచన చేసింది.

పిల్లలు ఫోన్ వంక చూడాలంటేనే భయపడిపోయేలా చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా ప్రాంక్ చేసేందుకు రెడీ అయిపోయింది. ఆ టీచర్ కంటికి గాయం అయినట్లుగా కట్టుకట్టుకుని మరో కంట్లో రక్తం కారుతున్నట్లుగా ఎర్రటి రంగును పూసుకుంది. కంటి గాయాలతో నటిస్తూ స్కూల్ గ్రౌండ్ లో ఉన్న పిల్లల ముందుకు వచ్చేసింది. ఆమెను చూసి తోటి ఉపాధ్యాయులతో పాటు స్కూల్ పిల్లలు కూడా భయపడిపోయారు. వెంటనే తేరుకుని మీ కళ్లకు ఏమైందంటూ ఆ టీచర్ ను అడగగా తాను ఎక్కువగా ఫోన్ వాడడం వల్ల ఇలా జరిగిందంటూ చెప్పుకొచ్చింది.

టీచర్ పరిస్థితి చూసిన తర్వాత స్కూల్ పిల్లలు వణికిపోయారు. టీచర్ చేసిన ఈ ప్రాంక్ కి పిల్లలు చాలా భయపడి పోయారు. జీవితంలో మొబైల్ ఫోన్ పట్టుకోవాలంటేనే భయం వచ్చేలా చేసారు ఆ టీచర్. కొందరు పిల్లలు ఫోన్ తీసుకోవడానికి నిరాకరించారు. మరికొంత మంది ఫోన్ వల్ల టీచర్ కు జరిగిన ప్రమాదాన్ని చూసి ఏడ్చారు. ఈ వీడియోను గనుక మీ పిల్లలకు చూపిస్తే ఇక జీవితంలో ఫోన్ పట్టుకోరు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. పిల్లలు ఫోన్ కు అడిక్ట్ అవ్వకుండా ఉండేందుకు టీచర్ చేసిన పనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఫోన్ తో పొంచి ఉన్న ప్రమాదంపై టీచర్ కల్పించిన అవగాహనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.