iDreamPost
android-app
ios-app

Atishi As Delhi CM:పక్కన ఖాళీ కుర్చీతో..సీఎంగా అతిశీ! ఎందుకంటే..

Atishi Takes Charge As CM: ఢిల్లీలో రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఆతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా సోమవారం సీఎంగా బాధ్యతలు చేపడుతున్న సమయంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది.

Atishi Takes Charge As CM: ఢిల్లీలో రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఆతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా సోమవారం సీఎంగా బాధ్యతలు చేపడుతున్న సమయంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది.

Atishi As Delhi CM:పక్కన ఖాళీ కుర్చీతో..సీఎంగా అతిశీ! ఎందుకంటే..

ఇటీవలే ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిశీ ప్రమాణ స్వీకరం చేసిన సగంతి తెలిసిందే.  నేడు సీఎంగా అతిశీ బాధ్యతలు స్వీకరించారు. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తర్వాత..ఆమె ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీకి మూడో మహిళ ముఖ్యమంత్రిగా అతిశీ రికార్డు క్రియేట్ చేశారు. అంతేకాక అతిపిన్న వయస్సులో ఢిల్లీకి ఎన్నికైన తొలి మహిళ ముఖ్యమంత్రిగా కూడా అతిశీ చరిత్ర సృష్టించారు. ఇది ఇలా ఉంటే సోమవారం సీఎంగా ఆమె బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఆమె సీఎంగా బాధ్యతలు చేపడుతున్న సమయంలో పక్కనే ఓ ఖాళీ కుర్చీ దర్శనమిచ్చంది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరిలో అనేక సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే అలా తన పక్కన ఖాళీ కుర్చీని ఉంచుకోవడానికి గల కారణాన్ని ఆమె వెల్లడించారు.

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో అతిశీ.. తమ పార్టీ అధినేత అరవింద్ క్రేజీవాల్ పై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. అందుకే ఆయన కోసం  పక్కనే కుర్చీని ఖాళీగా ఉంచి. తాను మరోక సీట్లో కూర్చొని బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఆప్ పార్టీ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఇక అలా ఖాళీ కూర్చీ గురించి  మీడియా ఆమె వద్ద ప్రస్తావించారు.  దీంతో ఆమె మాట్లాడుతూ.. రామాయణంలోని ఓ సందర్భాన్ని గుర్తు చేశారు. తనకు ప్రస్తుతం భరతుడికి ఎదురైన పరిస్థితే ఉందని తెలిపింది. రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు అయోధ్యను భరతడు పాలించాల్సి వచ్చింది. ఇక సింహాసనంపై రాముడి పాదుకలు ఉంచి  భరతడు రాజ్యాన్ని పాలించాడు.  అచ్చం అలానే ఈ కుర్చీ కూడా అరవింద్ క్రేజీవాల్ ది అని ఆమె చెప్పుకొచ్చారు. మరో నాలుగు నెలల తరువాత జరిగే ఎన్నికల్లో ఢిల్లీలో మళ్లీ ఆయనే అధికారాన్ని చేపడతారని బలంగా నమ్ముతున్నామని తెలిపారు. ఆయన తిరిగి వచ్చే వరకు ఈ కూర్చీ ఇక్కడే ఉంటుందని ఢిల్లీ సీఎం అతిశీ అన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై బెయిల్‌ పై బయటకు వచ్చిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసింది. ఆ సమయంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న సందేహం కలిగాయి.  ఈ క్రమంలో అతిశీ, గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పేర్లు వినిపించాయి. చివరకు మంత్రి అతిశీకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించేందుకు ఆమోదం తెలిపారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. ఆప్ జాతీయ కన్వీనర్ అతిషీ పేరును ప్రతిపాదించగా..మిగిలిన ఎమ్మెల్యేలంతా ఆమోదం తెలిపారు. కేజ్రీవాల్ కేబినెట్ లో ఉన్న ఏకైక మహిళ మంత్రి  ఆమె కావడం గమన్హారం. ఇలా హాస్తినాలో జరిగిన అనూహ్య పరిణామాల మధ్య ఆతిశీ సీఎంగా బాధ్యతలు చేపట్టింది. అయినప్పటికీ తమ అధినేతపై ఉన్నగౌరవాన్ని..ఖాళీ కూర్చి వేసి ప్రత్యేకంగా తెలియజేసింది. మరి.. ఢిల్లీ సీఎం అతిశీ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.