iDreamPost
android-app
ios-app

ఇన్‌స్టాలో హిందూ పేరు పెట్టుకొని.. హిందూ బాలికను ట్రాప్ చేసి వేధింపులు.. చివరకు

  • Published Oct 24, 2024 | 12:37 PM Updated Updated Oct 24, 2024 | 12:37 PM

Love Jihad: ఇన్ స్టాగ్రామ్ లో లవ్ జిహాద్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీలో ఓ ముస్లిం యువకుడు ఇన్ స్టాలో హిందూ పేరు పెట్టుకుని హిందూ బాలికను ట్రాప్ చేసి వేధింపులకు పాల్పడ్డాడు.

Love Jihad: ఇన్ స్టాగ్రామ్ లో లవ్ జిహాద్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీలో ఓ ముస్లిం యువకుడు ఇన్ స్టాలో హిందూ పేరు పెట్టుకుని హిందూ బాలికను ట్రాప్ చేసి వేధింపులకు పాల్పడ్డాడు.

ఇన్‌స్టాలో హిందూ పేరు పెట్టుకొని.. హిందూ బాలికను ట్రాప్ చేసి వేధింపులు.. చివరకు

సోషల్ మీడియా వల్ల మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే స్థాయిలో ఉందనడంలో సందేహం లేదు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ వాడుతూ చిక్కులు కొనితెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఇన్ స్టాలో ఫేమస్ అయిపోవాలని విచ్చలవిడిగా రీల్స్ చేస్తూ ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. మరికొంత మంది ఇన్ స్టాలో పరిచయాలు పెంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ప్రేమగా మాట్లాడుతూ, చాట్ చేస్తూ ముగ్గులోకి దింపుతున్నారు. సోషల్ మీడియా వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. సోషల్ మీడియా ప్రేమలు ప్రాణాలను తీస్తున్నాయి. ఇప్పుడు ఇన్ స్టాలో లవ్ జిహాది వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అమ్మాయిలను ట్రాప్ చేసేందుకు ఇన్ స్టా ను వేదికగా మలుచుకుంటున్నారు.

తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇన్ స్టా లో లవ్ జిహాది వెలుగుచూసింది. ఓ ముస్లిం యువకుడు హిందూ బాలికను ఇన్ స్టాలో ట్రాప్ చేసి వేధింపులకు గురిచేశాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో సద్దాం అన్సారీ అనే ముస్లిం యువకుడు ఇన్ స్టాలో హిందూ పేరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత 17 ఏళ్ల హిందూ బాలికను ట్రాప్ చేశాడు.ఫేక్ ఐడీతో ట్రాప్ చేసి వేధింపులకు పాల్పడ్డాడు. ఇన్ స్టాలో చాట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేశాడు. ఆ తర్వాత బాలిక స్కూల్ నుంచి వస్తుండగా సద్దాం వేధింపులకు గురిచేశాడు.

కాగా వేధింపులు ఎక్కువవుతుండడంతో బాలిక పోలీసులను ఆశ్రయించింది. బాలిక సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ముస్లిం యువకుడు బాలికను వేధిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ యువకుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. లవ్ జిహాది పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న పోకిరీలను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఫేక్ ఐడీలను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానం కలిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. మరి హిందూ బాలికను ట్రాప్ చేసి వేధింపులకు గురిచేసిన ముస్లిం యువకుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.