iDreamPost
android-app
ios-app

కేంద్రం గుడ్ న్యూస్.. తగ్గనున్న ఉల్లి ధరలు!

  • Published Sep 05, 2024 | 9:09 AM Updated Updated Sep 05, 2024 | 9:09 AM

Central Govt is Good News: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు పెద్దలు. మరి అలాంటి ఉల్లి మార్కెట్ లో చుక్కలు చూపిస్తుంది.గత రెండు మూడు నెలల నుంచి ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Central Govt is Good News: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు పెద్దలు. మరి అలాంటి ఉల్లి మార్కెట్ లో చుక్కలు చూపిస్తుంది.గత రెండు మూడు నెలల నుంచి ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్రం గుడ్ న్యూస్.. తగ్గనున్న ఉల్లి ధరలు!

ఇటీవల ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోతూ వచ్చాయి. గత వారం రోజుల్లోనే ఉల్లి ధర కిలో రూ.10 కి పెరిగింది.మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాలే ధరల పెరుగుదలకు కారణం అంటున్నారు. ఇప్పట్లో వర్షాలు తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. హూల్ సేల్ మార్కెట్ లో కిలో ఉల్లి రూ.40 నుంచి రూ.45 ఉంటే.. మార్కెట్ లోకి వచ్చేసరికి రూ.60 నుంచి రూ.70 కి చేరుకుంటుంది. రానున్న రోజుల్లో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఉల్లి ధర పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకొని సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..

గత కొన్నిరోజులుగా దేశంలో ఉల్లిధరలు పెరిగిపోతూ వస్తున్నాయి.ఇప్పటికే నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోతుంటే.. ఇప్పుడు ఉల్లిధరలు సైతం చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ఉల్లి కొనుగోలు చేయాంటే ఆలోచనలో పడుతున్నారు మధ్యతరగతి కుటుంబీకులు. ఈ క్రమంలోనే ఢిల్లీ – ఎన్‌సీఆర్ ప్రజలకు పెద్ద ఊరట లభించింది. దేశ రాజధాని, చుట్టు పక్కల నగరాల్లో కిలో ఉల్లి ధర రూ.60 కి చేరడంతో కేంద్ర ప్రభుత్వమే రాయితీపై ఉల్లిని విక్రయించాలని నిర్ణయించింది. మార్కెట్ లో ఉల్లి ధరను తగ్గించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.. ఈ క్రమంలోనే ఢిల్లీ- ఎన్‌సీఆర్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఉల్లిని కిలో రూ.35 కి విక్రయించింది. కేంద్రం బఫర్ స్టార్ విడుదల చేయనుండటంతో దేశ వ్యాప్తంగా ధరలు తగ్గే అవికాశం ఉన్నట్లు కనిపిస్తుంది.

దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గురువారం (సెప్టెంబర్ 5) నుంచి ఉల్లి విక్రయాలు ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది. ఇందుకోసం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నాఫెడ్.. ఎన్‌సిసిఎఫ్‌లను ఆదేశాలు జారీ చేసింది.  ప్రభుత్వ సంస్థలు నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్‌ రెండూ ప్రజలకు తక్కువ ధరలకు ఆహార పదార్ధాలను అందించడానికి ప్రభుత్వం తరుపున పనిచేస్తాయి. ఈ సంస్థలు సెంట్రల్ స్టోర్స్, మొబైల్ వాహనాలు, ఇతర మార్గాల ద్వారా ప్రజలకు తక్కువ ధరకే ఆహార పదార్ధాలు విక్రయిస్తుంటాయి. గత ఏడాది దేశ వ్యాప్తంగా ఉల్లితో పాటు టమోటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.. ఆ సమయంలో నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్‌ ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు టమాట, ఉల్లిపాయలు విక్రయించడం జరిగింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఉల్లి ధర తగ్గితే సామాన్యులకు పెద్ద ఊరటే అంటున్నారు.