iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ తగ్గిన పుత్తడి ధర.. నేడు ఎంతంటే?

  • Published Aug 31, 2024 | 8:48 AM Updated Updated Aug 31, 2024 | 8:48 AM

Today Gold and Silver Rates in Hyderabad: ఇటీవల పసిడి ధరలు ఎప్పుడు పెరుతాయో, ఎప్పుడు తగ్గుతున్నాయో తెలియని పరిస్థితి. మూడు రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.

Today Gold and Silver Rates in Hyderabad: ఇటీవల పసిడి ధరలు ఎప్పుడు పెరుతాయో, ఎప్పుడు తగ్గుతున్నాయో తెలియని పరిస్థితి. మూడు రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.

పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ తగ్గిన పుత్తడి ధర.. నేడు ఎంతంటే?

దేశంలో శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి పండుగలు, పెళ్లిళ్ళు ఇతర శుభకార్యాల సీజన్ మొదలైంది. బంగారం అంటే మగువలకు ఎంతో ఇష్టం.. ఈ సీజన్ లో మరింత కొనుగోలు పెరిగిపోతుంది. జ్యూలరీ షాపులు కిటకిటలాడుతున్నాయి. ఇటీవల పసిడి ధరలు తరుచూ పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. ఎప్పుడు పసిడి కొనుగోలు చేయాలో అర్థం కాని పరిస్థితి. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతన్న కీలక పరిణామాలు, యుద్దల ప్రభావం పసిడి, వెండి పై పడుతుందని నిపుణులు అంటున్నారు. మహిళలకు గుడ్ న్యూస్.. నేడు పసిడి కాస్త దిగివచ్చింది. మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

గతనెల పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. తర్వాత రోజు నుంచి పసిడి ధరలు అమాంతం తగ్గాయి. ఒక్క వారంలోనే ఏకంగా రూ.7 వేల వరకు తగ్గింది. ఆ తర్వాత అనూహ్యంగా పెరిగిపోతూ వస్తుంది. మొన్నటి వరకు పెరిగిపోతూ వచ్చిన పసిడి కాస్త దిగి వచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గి, 67,040వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గి, 73, 140 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,040 వద్ద ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గి, రూ. 73, 140 వద్ద కొనసాగుతుంది.

Today Gold Rates

దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పసిడి, వెండి ధరల విషయానికి వస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,190 వద్ద ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గి, రూ.73,290 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,040 వద్ద ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గి, రూ. 73,140 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,040 వద్ద ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గి, రూ. 73,140 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. దేశంలో కిలో వెండి పై రూ.100 తగ్గింది. చెన్నై, హైదరాబాద్, వరంగల్, విశాఖలో రూ. 92,900, ఢిల్లీలో కిలో వెండి రూ. 87,900, ముంబైలో కిలో రూ.88,300 వద్ద కొనసాగుతుంది.