iDreamPost
android-app
ios-app

ట్రాఫిక్ పోలీసులు బంపర్ ఆఫర్.. ఆ పనిచేస్తే రూ.50 వేలు మీ సొంతం!

  • Published Sep 02, 2024 | 9:12 PM Updated Updated Sep 02, 2024 | 9:12 PM

Delhi Traffic Police: ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు.

Delhi Traffic Police: ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు.

ట్రాఫిక్ పోలీసులు బంపర్ ఆఫర్.. ఆ పనిచేస్తే రూ.50 వేలు మీ సొంతం!

ఇటీవల చాలా మంది వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూన్నారు. దీని వల్ల నిత్యం రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలు తీసుకువచ్చినా వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాంటి వారికి చలాన్లు విధిస్తున్నారు పోలీసులు. దేశంలో రోజు రోజుకీ వాహనాల సంఖ్య పెరుగుతున్నాయి.. దానితో పాటు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించేవారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. వివరాల్లోకి వెళితే..

గత కొంత కాలంగా దేశ రాజధాని ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చేయవొచ్చని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. ఎవరైతే రోడ్డుపై ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తారో వారి ఫోటోలు, వివరాలను పోలీసులకు అందించి భారీ నగదు బహుమతి పొందవొచ్చునని తెలిపారు.

Delhi Traffic Police 02

రోడ్డుపై ఎవరైతే రూల్స్ ని అతిక్రమిస్తారో వారి ఫోటోలు, వీడియోలు సెల్ ఫోన్ ద్వారా ట్రాఫిక్ పోలీసుకు పంపింస్తే వారికి ప్రోత్సాహకంగా రూ. 50 వేలు నజరానా ఇవ్వనున్నట్లు ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ విభాగం తెలిపింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ విధానం అందుబాటులోకి తెచ్చిన్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పపడే వాహనదారులకు సంబంధించిన ఫోటో, వీడియో, వెహికిల్ నెంబర్ సహా పలు వివరాలు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ట్రాఫిక్ ప్రహారీ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి వెంటనే సదరు వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ యాప్ ద్వారా ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వారికి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు రివార్డులు ఇస్తామని చెప్పారు.