Krishna Kowshik
అమ్మ.. కేవలం సపర్యలు చేసే మనిషి కాదు.. ఎన్నో త్యాగాలు చేసే అమృత మూర్తి. అమ్మ అనే పిలుపు కోసం జీవితాంతం తన సుఖాన్ని, ఆనందాన్ని మర్చిపోతుంది. బిడ్డలను అన్నీ తానే చూసుకుంటుంది. కానీ ఆమె మలిదశలో ఉన్నప్పుడు..
అమ్మ.. కేవలం సపర్యలు చేసే మనిషి కాదు.. ఎన్నో త్యాగాలు చేసే అమృత మూర్తి. అమ్మ అనే పిలుపు కోసం జీవితాంతం తన సుఖాన్ని, ఆనందాన్ని మర్చిపోతుంది. బిడ్డలను అన్నీ తానే చూసుకుంటుంది. కానీ ఆమె మలిదశలో ఉన్నప్పుడు..
Krishna Kowshik
అమ్మను మించిన యోధులు ఈ లోకంలో లేరని ఓ మూవీలో డైలాగ్ ఉంటుంది. నిజమే మరీ. . తాను చనిపోతానని తెలిసి కూడా మరో బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. బిడ్డ కడుపులో పడిన నాటి నుండి పొత్తిళ్లలోకి తీసుకునేంత వరకు పెద్ద యుద్దమే చేస్తుంది. అమ్మ అనే పిలుపు కోసం పరితపించి పోతుంది. బుడి బుడి అడుగులు, బుజ్జి బుజ్జి మాటలు మాట్లాడుతుంటే మురిసిపోతుంది. కష్ట కాలంలో తను తినకపోయినా.. బిడ్డల కడుపు నింపుతుంది. పిల్లలు ప్రయోజకులు అయ్యేందుకు అహర్నిశలు కష్టపడుతుంది. నిద్రాహారాలు మాని..వారి బాగోగులు చూస్తుంది. చిన్న జ్వరమొచ్చినా అల్లాడిపోతుంది మాతృమూర్తి. అంతటి త్యాగశీలి మలిదశకు వచ్చే సరికి అండగా నిలవాల్సిన పిల్లలు, ఆదుకోవాల్సిన బిడ్డలు.. తమ స్వార్థం చూసుకుంటున్నారు. వృద్ధాప్య దశలో వెన్నుదన్నుగా నిలవాల్సిన పిల్లలు ఇంకా వారిపై ఆధారపడుతూ నరకం చూపిస్తున్నారు.
ఇదిగో ఈ మహాతల్లి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చేతికొచ్చిన కొడుకు ఉన్నాడు. అయినప్పటికీ 55 ఏళ్ల వయస్సులో అర్థరాత్రి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంది. రాత్రంతా కష్టపడి ఎప్పటికో ఇంటికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ తల్లి కన్నీటి కథనం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఢిల్లీకి చెందిన ఈ మహిళకు ఓ కొడుకు ఉన్నాడు. కుమారుడికి 2 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు భర్తను కోల్పోయింది. కొడుకే సర్వస్వం అనుకుని జీవించింది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ బిడ్డను పెంచింది. కానీ అడ్డాల నాడు బిడ్డలు కానీ.. గడ్డాల నాడు కాదని నిరూపించాడు కొడుకు. ఆమె ఆనందాన్ని, సుఖాన్ని వదులుకొని తన కోసం కష్టపడిన అమ్మకోసం చేయూతగా నిలవాల్సిన కొడుకు.. ఆమెపైనే ఆధారపడం మొదలు పెట్టాడు. డబ్బులు ఇవ్వాలంటూ ఆమెతో గొడవ పడేవాడు.
డబ్బులు ఇవ్వకపోతే వస్తువులను విసిరేయడం, తల్లిపై అరవడం వంటి పనులు చేసేవాడు. ఘోరంగా అవమానించేవాడు. ఈ వయస్సులో ఎవరిని అడిగిన ఆమెకు ఓ ముద్ద వేస్తారు. కానీ అడుక్కోవడం కంటే కష్టపడి పనిచేయడం మంచిదని భావించింది. తన కాళ్లపై తాను నిలబడుతూ.. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంది. రాత్రి పూట ఆటో నడుపుతుంది. ఆమె ఇంటికి వచ్చే సరికి రాత్రి 1.30 గంటలకు వస్తుందట. ఈ విషయాలన్నింటినీ ఈ ఢిల్లీ మహిళ ఆయుష్ గోస్వామి అనే బ్లాగర్‌తో పంచుకుంది. ఇంత కష్టపడుతూ కూడా కొడుకును ఓ మాట అనడం లేదు ఈ మహా తల్లి. కొడుకు అలా అయిపోవడానికి కారణం తన పెంపకం లోపమని.. తప్పును తనమీద వేసుకుంది. ఇది కదా తల్లి మనస్సు అనిపించకమానదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. కాగా, నెటిజన్లు తమ చేతికి పని చెప్పి.. కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.