iDreamPost
android-app
ios-app

జానీ మాస్టర్ కి బిగ్ షాక్.. నేషనల్ ఫిల్మ్‌ అవార్డు రద్దు!

  • Published Oct 06, 2024 | 11:08 AM Updated Updated Oct 06, 2024 | 11:08 AM

National Film Award: తెలుగు ఇండస్ట్రీలోకి చిన్న డ్యాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టి పాన్ ఇండియా స్థాయిలో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఎదిగిన జానీ మాస్టర్ ప్రస్తుతం లైంగిక, అత్యాచార కేసులో జైలు ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

National Film Award: తెలుగు ఇండస్ట్రీలోకి చిన్న డ్యాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టి పాన్ ఇండియా స్థాయిలో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఎదిగిన జానీ మాస్టర్ ప్రస్తుతం లైంగిక, అత్యాచార కేసులో జైలు ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  • Published Oct 06, 2024 | 11:08 AMUpdated Oct 06, 2024 | 11:08 AM
జానీ మాస్టర్ కి బిగ్ షాక్.. నేషనల్ ఫిల్మ్‌ అవార్డు రద్దు!

సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్లో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ ప్రస్తుతం లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఓ యువతి అతనిపై ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై ఫోక్సో కేసు, రేప్ కేసు, లైంగిక వేధింపుల కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు పోలీసులు విచారణ అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్ ని కష్టాలు వీడటం లేదు. జైలులో ఉన్న జానీ మాస్టర్ కి ఊహించని బారీ షాక్ తగిలింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

జానీ మాస్టర్ ని బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. ఆయన ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నేషనల్ ఫిల్మ్ అవార్డును కమిటీ రద్దు చేసింది. జానీ మాస్టర్ కి నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2022లో బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు దక్కింది. అక్టోబర్ 8న ఢిల్లీలో జరిగే వేడుకల్లో జానీ మాస్టర్ ఈ అవార్డు అందుకోనున్నారు. ఇదే సమయంలో జానీ మాస్టర్ పై ఫోక్సో కేసు నమోదు కావడంతో నేషనల్ ఫిలిం అవార్డును కమిటీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాను ఢిల్లీలో బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు అందుకోవాలి.. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టుకు కోరగా ఈ నెల 6 నుంచి 10 వరకు బెయిల్ సైతం మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో జానీ మాస్టర్ కి పెద్ద ఊరట లభించిందని భావిస్తున్న వేళ నేషనల్ ఫిల్మీ అవార్డు క్యాన్సల్ కావడం సంచలనంగా మారింది.

తెలుగు ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగిన జానీ మాస్టర్ కొంత కాలంగా లైంగికంగా వేధించి.. పలుమార్లు అత్యాచారం చేశాడని ఆయన వద్ద పనిచేసిన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆరోపించింది. హైదరాబాద్, ముంబైతో పాటు ఔట్ డోర్ షూటింగ్స్ కి వెళ్లినపుడు జానీ మాస్టర్ పదే పదే తనను లైంగిక దాడికి గురిచేసినట్లు యువతి ఫిర్యాదు చేసింది. వేధింపులే కాదు.. ఇటీవల జానీ, అతని భార్య కలిసి తన ఇంటికి వచ్చి దారుణంగా కొట్టారని.. తాము చెప్పినట్లు వినకుంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైనర్ గా ఉన్నప్పటి నుంచి అత్యాచారం చేశాడని ఆరోపించింది బాధితురాలు. మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని టార్చర్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఆరోపణలపై జానీ మాస్టర్ ని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు పంపించారు.