హైదరాబాద్ లోని సనత్ నగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జింకలవాడ బస్తీలో తన ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిపై కొందరు యువకులు కారు ఎక్కించారు. నిందితులు ఓవర్ స్పీడ్ తో కారు నడపడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదంలో చిన్నారి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించింది. ప్రమాదం అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారుని గుర్తించారు. నిందితుల కోసం […]
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. ఐ. పోలవరం మండలం పాత ఇంజరం 216 జాతీయ రహదారిపై పొన్నాడ సతీష్ కుమారుడు సుమంత్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురయింది. పాత ఇంజరం 216 జాతీయ రహదారిపై పొన్నాడ సుమంత్ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక ఈ ప్రమాదంలో […]
రోడ్డు ప్రమాదం నుంచి ప్రముఖ క్రైస్తవమత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ క్షేమంగా బయటపడ్డారు. ఈరోజు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్పోస్టు వద్ద అనిల్ ప్రయానిస్తున్న కారు అదుపుతప్పింది. ఈ క్రమంలో కారు ఫుట్పాత్ను దాటి రహదారి బయటకు వచ్చింది. పోలంలోకి దూసుకెళ్లిన కారు అక్కడ ఉన్న గోతిలో చిక్కుకుని ఆగిపోయింది.