iDreamPost
android-app
ios-app

హీరో యష్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని అభిమానికి తీవ్ర గాయాలు!

  • Published Feb 29, 2024 | 5:19 PM Updated Updated Feb 29, 2024 | 5:19 PM

Hero Yash Escort Vehicle Crashed: కన్నడ రాక్ స్టార్ యష్ ‘కేజీఎఫ్’ సీరీస్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల యష్ అభిమానులకు వరుసగా దుర్ఘటనలు జరుగుతున్నాయి.

Hero Yash Escort Vehicle Crashed: కన్నడ రాక్ స్టార్ యష్ ‘కేజీఎఫ్’ సీరీస్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల యష్ అభిమానులకు వరుసగా దుర్ఘటనలు జరుగుతున్నాయి.

  • Published Feb 29, 2024 | 5:19 PMUpdated Feb 29, 2024 | 5:19 PM
హీరో యష్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని అభిమానికి తీవ్ర గాయాలు!

ఈ మధ్య రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు కన్నుమూస్తున్నారు. సాధారణంగా స్టార్ హీరోలు, హీరోయిన్లు ఔట్ డోర్ కి వెళితే.. అభిమానుల కోలాహలం ఓ రేంజ్‌లో ఉంటుంది. కొన్నిసార్లు ఇది ప్రమాదాలకు దారి తీసిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. తాాాజాగా కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు క్రిష్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని అభిమానికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే..

కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు టాలీవుడ్ లో కూడా తమ పాపులారిటీ పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో రాక్ స్టార్ యష్ ఒకరు. ఒకప్పుడు యష్ అంటే ఎవరికీ పెద్దగా తెలియదు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘కేజీఎఫ్’ సీరీస్ తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా యష్ కాన్వాయ్ ఢీ కొని ఓ అభిమాని కాలు విరిగింది. ఈ ఘటన బళ్లారి సమీపంలోని తాలూర్ లోని అమృతేశ్వరాలయం వద్ద చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత కొర్రపాటి సాయి నిర్మించిన అమృతేశ్వరాలయానికి నేడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆలయ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి అతిథిగా యష్ తో పాలు ఇతర ప్రముఖులు విచ్చేశారు. ఈ వేడుకకు దర్శకధీరుడు రాజమౌళి, రాష్ట్ర మంత్రి బి నాగేంద్ర విచ్చేశారు. బళ్ళారికి హీరో యష్ వస్తున్నాడన్న వార్త తెలియగానే అభిమానులు అక్కడికి ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఈ క్రమంలోనే బాలాజీ నగర్ క్యాంపు వద్ద సందడి నెలకొంది. ఈ క్రమంలోనే వసంత్ అనే యువకుడు యష్ కాన్వాయ్ వద్దకు రాగానే చక్రం ఢీకొని ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అతన్ని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు.

ఇటీవల యష్ ఎక్కడికి వెళ్లినా అభిమానుల తాకిడి ఎక్కువ అవుతుంది. ఆయనతో సెల్ఫీకోసం ఎగబడుతున్నారు. ఈ మద్యనే ఆయన పుట్టిన రోజు సందర్బంగా ఆయన బ్యానర్ కడుతున్న సందర్భంగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు అభిమానులు చనిపోయారు. ఈ ఘటనతో యష్ తీవ్ర ఆవేదన చెందారు. స్వయంగా వెళ్లి  వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.  పరామర్శించి వస్తున్న సమయంలో అనీల్ అనే స్కూటరిస్ట్ యష్ కారుకి వచ్చి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో పెద్దగా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలా వరుసగా అభిమానులు గాయపడటంతో యాష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.  ప్రస్తుతం యష్ ‘టాక్సీక్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీకి మాలీవుడ్ కి చెందిన గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుంది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio