iDreamPost
android-app
ios-app

పెళ్లైన వారం రోజులకే నవ దంపతుల మృతి.. ఏం జరిగిందంటే?

  • Published Mar 06, 2024 | 10:48 AM Updated Updated Mar 06, 2024 | 10:48 AM

Nandyala Accident: వివాహబంధంతో ఒక్కటైన ఆ జంట తమ భవిష్యత్ కోసం ఎన్నో కలలు కన్నారు. కానీ పెళ్లైన వారం రోజులకే నూతన వధూవరులను మృత్యువు కబలించింది. అసలు ఏం జరిగిందంటే..

Nandyala Accident: వివాహబంధంతో ఒక్కటైన ఆ జంట తమ భవిష్యత్ కోసం ఎన్నో కలలు కన్నారు. కానీ పెళ్లైన వారం రోజులకే నూతన వధూవరులను మృత్యువు కబలించింది. అసలు ఏం జరిగిందంటే..

  • Published Mar 06, 2024 | 10:48 AMUpdated Mar 06, 2024 | 10:48 AM
పెళ్లైన వారం రోజులకే నవ దంపతుల మృతి.. ఏం జరిగిందంటే?

మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు హఠాత్తుగా కానరాని లోకాలకు వెళ్తుంటారు. ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న పొరపాటు వల్ల ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా.. వాహనదారులు చేసే తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. నిద్రమత్తు,  నిర్లక్ష్యం, అతి వేగం, అవగాహన లేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కన్నుమూశారు.. ఈ ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలంల నల్లగట్ల వద్ద ఆగి ఉన్న లారీనీ ఓ కారు బలంగా ఢీ కొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు పోలీసులు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.. నిద్ర మత్తు వల్లనే జరిగి ఉండవొచ్చని అనుమానిస్తున్నారు.

ఫిబ్రవరి 29న పెళ్లి జరిగి రెండు రోజుల క్రితమే షామీర్ పేట్ లో రిసెప్షన్ కాగా.. దైవ దర్శనం కోసం నూతన వధూవరులుతో పాటు కుటుంబ సభ్యులు తిరుమల దర్శనం చేసుకొని వస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ అల్వాల్ కు చెందిన వధూవరులు బాల కిరణ్, కావ్య. వీరితో పాటు వరుడు తల్లిదండ్రులు లక్ష్మి, రవికుమార్ తో పాలు ఓ బాలుడు మృతి చెందాడు. పెళ్లై వారం రోజులు కూడా కాలేదు.. అప్పుడు నిండు నూరేళ్లు నిండాయా అంటూ ఇరు వర్గాల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నూతన వధూవరులు కన్నుమూసిన వార్త తెలిసిన తర్వాత అల్వాల్ లో తీవ్ర విషాదం నెలకొంది.