iDreamPost
android-app
ios-app

వీడియో: దైవ దర్శనం చేసుకుని బయటకు వచ్చింది.. సరదాగా వీడియో తీస్తుండగా

  • Published Jun 18, 2024 | 1:18 PM Updated Updated Jun 18, 2024 | 1:18 PM

దైవ దర్శనానికి వచ్చింది.. ప్రశాంతంగా దేవుడిని మొక్కుకుంది. తిరిగి వెళ్లే క్రమంలో యువతి అత్యుత్సాహంతో చేసిన పని తీరని విషాదాన్ని నింపింది. ఆ వివరాలు..

దైవ దర్శనానికి వచ్చింది.. ప్రశాంతంగా దేవుడిని మొక్కుకుంది. తిరిగి వెళ్లే క్రమంలో యువతి అత్యుత్సాహంతో చేసిన పని తీరని విషాదాన్ని నింపింది. ఆ వివరాలు..

  • Published Jun 18, 2024 | 1:18 PMUpdated Jun 18, 2024 | 1:18 PM
వీడియో: దైవ దర్శనం చేసుకుని బయటకు వచ్చింది.. సరదాగా వీడియో తీస్తుండగా

కొన్ని సంఘటనలు చూస్తే విధి ఎంత విచిత్రమైందో అనిపించక మానదు. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న వారు అకస్మాత్తుగా మన నుంచి దూరమవుతారు. ఎంతో సంతోషంగా మనతో గడుపుతున్న వారు మన కళ్ల ముందే మృత్యు ఒడికి చేరుకుంటారు. అసలేం జరిగిందో మనకు అర్థం కావడానికి సమయం పడుతుంది. తాజాగా ఇదే తరహా సంఘటన ఒకటి చోటు చేసుకుంది. దైవ దర్శనం కోసం వచ్చిన యువతి.. ఎంతో భక్తిగా దేవుడిని దర్శించుకుంది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా గడిపింది. కానీ ఇంతలోనే ఊహించని దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు..

పైన ఫొటోలో ఉన్న యువతి ఎంతో సరదాగా దైవ దర్శనం కోసం వచ్చింది. భక్తిగా దేవుడిని దర్శించుకుంది. ఆలయం నుంచి బయటకు వచ్చాక యువతి చేసిన పని ఆమె నిండు జీవితాన్ని బలి తీసుకుంది. కారు డ్రైవ్‌ చేయాలనే కోరిక ఆ యువతి ప్రాణాలు తీసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని సంభాజీ నగర్‌, ఎల్లోరా గుహలకు వెళ్లే మార్గంలో దత్‌ధామ్‌ ఆలయం వద్ద చోటు చేసుకుంది. మృతురాలిని శ్వేత దీపక్‌ సుర్వాసే(23)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్వేత అనే యువతి తన స్నేహితుడు సంజౌ ములేతో కలిసి సోమవారం మధ్యాహ్నం.. ఔఔరంగాబాద్‌లోని సులిభంజన్‌ వద్ద దత్‌ధామ్‌ ఆలయానికి వచ్చింది. దైవ దర్శనం తర్వాత బయటకు వచ్చిన శ్వేత.. కారు డ్రైవ్‌ చేయాలని ఆశపడింది.

అయితే వారు దర్శనానికి వెళ్లిన ఆలయం 300 అడుగులు ఎత్తున ఉంది. ఉంది. డ్రైవింగ్‌లో ఎక్స్‌పర్ట్‌ అయిన వారికే అలాంటి ప్రదేశంలో కారు నడపడం చాలా సాహసంతో కూడుకున్న పని. అలాంటిది డ్రైవింగ్‌లో ఓనమాలు కూడా రాని శ్వేత.. అక్కడ కారు నడపాలని ముచ్చట పడింది. అందుకు ఆమె మిత్రుడు సంజౌ అంగీకరించడమే కాక.. శ్వేత కారు డ్రైవ్‌ చేస్తుంటే వీడియో తీస్తున్నాడు. ఇక ఎంతో ఉత్సాహంగా టయోటా ఎటియోస్‌ కారు ఎక్కి డ్రైవింగ్‌ ప్రారంభించిన శ్వేత.. 300 అడుగుల ఎత్తైన కొండ మీద తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలని భావించింది. మెల్లిగా కారును రివర్స్‌ చేస్తుండగా.. పొరపాటున యాక్సిలరేటర్‌ మీద కాలు వేసింది. దాంతో కారు వేగం పుంజుకుంది.

వీడియో తీస్తూ ఈ ప్రమాదాన్ని గమనించిన సంజౌ.. ఆమెను స్లో చేయమని హెచ్చరిస్తూనే, “క్లచ్, క్లచ్, క్లచ్” అంటూ అరిచాడు. ఆమెను ఆపడానికి పరిగెత్తాడు. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. కళ్లు మూసి తెరిచే లోపే కారుతో పాటు శ్వేత కూడా 300 అడుగుల కొండపై నుండి లోయలోకి జారి పడి కన్నుమూసింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, కారు 300 అడుగుల ఎత్తును నుంచి జారి లోయలోకి పల్టీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.