iDreamPost
android-app
ios-app

లాస్య నందిత ప్రమాదంపై కీలక విషయాలు వెల్లడించిన ఏఎస్పీ

  • Published Feb 24, 2024 | 9:54 AM Updated Updated Feb 24, 2024 | 9:54 AM

Lasya Nanditha Car Accident Reasons: శుక్రవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. దీంతో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Lasya Nanditha Car Accident Reasons: శుక్రవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. దీంతో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

లాస్య నందిత ప్రమాదంపై కీలక విషయాలు వెల్లడించిన ఏఎస్పీ

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు, రాజకీయ నేతలు రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం పాలవుతున్నారు. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య సందిత మృతి చెందిన విషయం తెలిసిందే. పది రోజుల క్రితమే ఆమె ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా.. డ్రైవర్ కి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. లాస్య సందిత రోడ్డు ప్రమాదం విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రమాదం ఎలా జరిగింది.. దీనికి గల కారణాలు ఏంటీ? అన్న విషయంపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య సందిత (33) పటాన్ చెరు ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురై కన్నుమూశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే లాస్య నందిత ఎమ్మెల్యే అయిన తర్వాత పలుమార్లు ఆమెను మృత్యువు వెంటాడుతూ వచ్చింది. ఒకసారి లిఫ్ట్ లో చిక్కుకొని, ఇటీవల రోడ్డు ప్రమాదం నుంచి తప్పించకున్నారు. ఈ సారి ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయింది.  ఈ ప్రమాదంపై మీడియాలో రక రకాల కథనాలు వస్తున్నాయి. తాజాగా దీనిపై పోలీస్ అధికారులు స్పందించారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది.. అందుకు కారణాలు వివరించారు.

సంగారెడ్డి జిల్లా ఏఎస్పీ సంజీవరావు మాట్లాడుతూ.. ‘ప్రమాదం జరిగిన సమయంలో కారులో లాస్య నందత తో పాటు ఆమె పీఏ ఆకాశ్ ఉన్నారు. గురువారవ రోజు రాత్రి సమయంలో తన కుటుంబ సభ్యులతో సదాశిపేటలోని దర్గాకు వెళ్లారు. తెల్లవారు జామున టిఫిన్ కోసమని సుమారు 4.58 గంటల ప్రాంతంలో శామీర్ పేట టోల్ ప్లాజా వద్ద ఔటర్ రింగ్ రోడ్డు పై ఎంట్రీ ఇచ్చారు. సుల్తాన్ పూర్ ఎగ్జిట్ సమీపంలో దాదాపు 5:30 గంటల సమయంలో ముందుగా వెళ్తున్న ఓ టిప్పర్ ను కారు ఢీ కొట్టి అదుపు తప్పి స్పీడ్ లో వెళ్లి రెయిలింగ్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది. లాస్య నంది సీటు బెల్టు పెట్టుకు్నా అది ఊడిపోయినట్లు కనిపిస్తుంది. స్పీడ్ గా వెళ్లి గుద్దుకోవడంతో తల భాగానికి తీవ్రంగా గాయమై.. దవడ భాగం విరిగిపోయింది. పక్కటెముకలు దెబ్బతిన్నాయి. మీడియాలో లాస్య ప్రమాద స్థలంలోనే చనిపోయిందని కథనాలు వచ్చాయి.. కానీ ప్రమాదం జరిగిన కొద్దిసేపు బతికే ఉన్నారు. కొనఊపిరితో ఉన్న లాస్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో కన్నుమూశారని ఏఎస్సీ వివరించారు.