iDreamPost
android-app
ios-app

బైక్‌ని ఢీ కొట్టిన ఘటనలో ప్రముఖ సినీ నటుడు అరెస్ట్..!

  • Published Aug 21, 2024 | 12:59 PM Updated Updated Aug 21, 2024 | 12:59 PM

Car Hits Motorcycl: ఇటీవల రోడ్డుపైకి వచ్చిన వాళ్లు క్షేమంగా ఇంటికి చేరుతారా? లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు నడపడం వల్ల ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

Car Hits Motorcycl: ఇటీవల రోడ్డుపైకి వచ్చిన వాళ్లు క్షేమంగా ఇంటికి చేరుతారా? లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు నడపడం వల్ల ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

  • Published Aug 21, 2024 | 12:59 PMUpdated Aug 21, 2024 | 12:59 PM
బైక్‌ని ఢీ కొట్టిన ఘటనలో ప్రముఖ సినీ నటుడు అరెస్ట్..!

దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారలు అంటున్నారు. నిద్రమత్తు, అవగాహన లేమి, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రతిరోజు పదుల సంఖ్యల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా అప్పుడప్పుడు ప్రమాదాలకు కారణం అవుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రముఖ నటుడు తన వాహనంతో బైక్ ని ఢీ కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

రోడ్డు ప్రమాదం కేసులో టాలీవుడ్ (బెంగాలీ ఇండస్ట్రీ) నటుడు సామ్రాట్ ముఖర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. సామ్రాట్ నడుపుతున్న కారు.. బైక్ ని ఢీ కొట్టడంతో అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. కాగా, నటుడు సామ్రాట్ ప్రముఖ బాలీవుడ్ నటీమణులు రాణీ ముఖర్జీ, కాజోల్ కి బంధువు అవుతారు. వివరాల్లోకి వెళితే.. నైరుతి కోల్‌కొతా‌లోని రాజా రామ్ మోహన్ రాయ్ రోడ్డు గుండా తన కారులో అతి వేగంగా దూసుకొచ్చి ఎదురుగా వస్తున్న బైక్ ని ఢీ కొట్టింది.. ఆ తర్వాత అదుపు తప్పి ఇంటి సరిహద్దు గోడను ఢీ కొట్టడంతో కారు ఆగిపోయింది. టోలీగంజ్‌లోని తన ఐస్‌క్రీమ్ షాప్ మూసి వేసి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు బాధితుడు సౌరవ్ హల్దర్ (29) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఆరోపణలపై సామ్రాట్ ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.  ఇక సామ్రాట్ ముఖర్జీ సినిమాల విషయానికి వస్తే.. రామ్ ఔర్ శ్యామ్, జంజీర్, భాయ్ భాయ్, సికందర్ సడక్ కా, హమ్ హై రాహి వంటి హిందీ చిత్రాల్లో నటించారు. పలు బెంగాల్ రియాల్టీ షోల్లో కూడా కనిపించారు. బెంగాలీ ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సామ్రాట్ ని అరెస్ట్ చేశారన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio