iDreamPost

USA: అమెరికాలో దారుణం.. ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి

  • Published May 22, 2024 | 8:03 AMUpdated May 22, 2024 | 3:08 PM

అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఉన్నత విద్య, ఉపాధి కోసం అగ్రరాజ్యం వెళ్లిన భారతీయ విద్యార్థులు మృతి చెందారు. అసలేం జరిగింది.. అంటే..

అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఉన్నత విద్య, ఉపాధి కోసం అగ్రరాజ్యం వెళ్లిన భారతీయ విద్యార్థులు మృతి చెందారు. అసలేం జరిగింది.. అంటే..

  • Published May 22, 2024 | 8:03 AMUpdated May 22, 2024 | 3:08 PM
USA: అమెరికాలో దారుణం.. ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి

ఉన్నత చదువులు కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా కిర్గిజ్‌స్థాన్‌లో భారతీయ విద్యార్థులపై.. అక్కడి స్థానికులు దాడులకు తెగ బడుతున్న సంగతి తెలిసిందే. కిర్గిజ్‌స్థాన్‌లోనే కాక.. విదేశాల్లో ఉన్నత విద్య, ఉపాధి కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులపై వరుసగా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల దాడులు జరుగుతుండగా.. కొన్ని చోట్ల ప్రమాదాల వల్ల మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా అమెరికాలో మరో దారుణం వెలుగు చూసింది. ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. ఆ వివరాలు..

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థులపై వరుసగా దాడులు జరగడం.. మృత్యువాతపడటం జరుగుతుంది. తాజాగా, జార్జియాలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ అమెరికన్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. యాక్సిడెంట్‌ సమయంలో కారులో ఐదుగురు విద్యార్థులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. జార్జియాలోని అల్పారెట్టాలో జరిగిన ఈ ప్రమాదంలో భారతీయ అమెరికన్ విద్యార్థులు శ్రియ అవసరాల, ఆర్యన్ జోషి, అన్వీ శర్మ మృతి చెందారు. రిత్విక్ సోమేపల్లి, మహమ్మద్ లియాఖత్ అనే ఇద్దరు గాయపడ్డారు. వీరంతా జార్జియా యూనివర్సిటీలోని సీనియర్ అల్ఫరెట్టా హైస్కూల్‌ విద్యార్థులుగా గుర్తించారు. ఈ సంఘటన మే 14న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్లడంతో అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన శ్రియ, ఆర్య ఘటనస్థలంలోనే మృతిచెందారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం నార్త్ ఫుల్టన్ ఆస్పత్రిలో చేర్పించారు. హస్పిటల్‌లో చికిత్స పొందుతూ అన్వీ శర్మ చనిపోయింది. ప్రస్తుతం రిత్విక్, లియాఖత్‌లకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా ప్రమాదంలో సమయంలో రిత్విక్‌ కారును నడుపుతున్నట్లు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్దారించారు. శ్రియ అవసరాల యూజేఏ షికారీ డ్యాన్స్ టీమ్‌లో సభ్యురాలు కాగా, అన్వీ శర్మ అదే బృందంలో గాయని. కాగా, ఇటీవల విదేశాలకు వెళ్లిన పలువురు భారతీయ విద్యార్థులు దుండగుల చేతిలో, ప్రమాదాల బారిన పడి ఇలా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి