Dharani
పెళ్లై రెండేళ్లే అవుతుంది.. ముప్పై ఏళ్లు కూడా లేవు. జీవితంలో మంచిగా సెటిల్ అవ్వాలని భావించి.. అప్పుడే పిల్లలు వద్దనుకున్నారు. భవిష్యత్తు గురించి ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారు. కానీ అవన్ని అర్థాంతరంగా ముగిశాయి. పాపం ఇలాంటి ఓ రోజు వస్తుందని ఆ దంపతులు ఊహించలేదు.
పెళ్లై రెండేళ్లే అవుతుంది.. ముప్పై ఏళ్లు కూడా లేవు. జీవితంలో మంచిగా సెటిల్ అవ్వాలని భావించి.. అప్పుడే పిల్లలు వద్దనుకున్నారు. భవిష్యత్తు గురించి ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారు. కానీ అవన్ని అర్థాంతరంగా ముగిశాయి. పాపం ఇలాంటి ఓ రోజు వస్తుందని ఆ దంపతులు ఊహించలేదు.
Dharani
వారిద్దరికి నిండా ముప్పై ఏళ్లు కూడా లేవు. పైగా రెండేళ్ల క్రితమే వారికి పెళ్లి జరిగింది. నూరేళ్ల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నారు. పిల్లలు, వారి ఫ్యూచర్ గురించి బోలేడు ఊసులు చెప్పుకున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే కలకాల కలిసి ఉండాలని భావించారు. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ.. అన్యోన్య దాంతప్యానికి మారు పేరులా నిలిచారు. ఒకరిపై ఒకరికి అంతులేని ప్రేమ.. మమకారం. జీవితాంతం అలానే ఉండాలని ఆశపడ్డారు. అయితే వారి అన్యోన్యత చూసి విధికి కన్ను కుట్టింది. పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లి.. సంతోషంగా గడిపి.. తిరిగి వస్తున్న వారిని అకాల మృత్యువు కబళించింది. ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. పాపం ఇలా జరుగుతుందని.. వారి జీవితం ఇలా అర్థాంతరంగా ముగుస్తుందని ఆ దంపతులు కలలో కూడా ఊహించుకోలేదు. ఇంతకు ఏం జరిగిందంటే..
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం శివారులోని పెట్రోలుబంకు వద్ద సోమవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగి ఉన్న కంటెయినర్ లారీని కారు ఢీకొట్టి.. దాని కిందకు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన సామినేని నవీన్‌రాజా (29), ఏపీలోని ఎన్‌టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన భార్గవి (27)లకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరూ ఉద్యోగులే. నవీన్‌రాజా విజయవాడ గూడవల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పని చేస్తుండగా.. భార్గవి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. ఈ దంపతులకు ఇంకా పిల్లలు లేరు.
ఇలా ఉండగా.. శనివారం నాడు భార్గవి బర్త్‌డే ఉండటంతో.. పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి నవీన్ ఆమెతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. శని, ఆదివారాలు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపారు. సోమవారం ఉదయం 6 గంటలకు కారులో విజయవాడకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఇక నవీన్ కారు నడుపుతుండగా.. పక్కసీట్లో భార్గవి కూర్చున్నారు. మునగాల మండలంలోని ముకుందాపురం గ్రామ శివారులో పెట్రోలుబంకు వద్ద ఆగి ఉన్న కంటెయినర్ లారీని.. వీరి కారు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టడమే కాకుండా.. దాని కిందకు దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో నవీన్, భార్గవిలు ప్రయాణిస్తున్న కారు టాప్ ఎగిరి పక్కనే ఉన్న బంకులో పడింది. భార్యాభర్తలు స్పాట్‌లోనే కన్ను మూశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికుల సహాయంతో జేసీబీ, క్రేన్‌తో రెండు గంటల పాటు శ్రమించి నవీన్, భార్గవిల మృతదేహాలను బయటకు తీయించారు. జాతీయ రహదారి పక్కన కంటెయినర్ లారీని నిలిపి ఉంచడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. నిండా ముప్పై ఏళ్లు కూడా నిండకుండానే.. ఈ దంపతుల జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నవీన్, భార్గవిల మృతితో వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొని ఉంది.