iDreamPost
android-app
ios-app

పూణే తరహాలో ఘటన.. బీఎండబ్ల్యూ బీభత్సం.. మహిళ మృతి!

  • Published Jul 07, 2024 | 4:52 PM Updated Updated Jul 07, 2024 | 4:52 PM

Mumbai Accident: ఇటీవల పుణెలో ఓ సంపన్న కుటుంబానికి చెందిన మైనర్ బాలుడు మద్యం మత్తులో ఖరీదైన పోర్ష్ కారుతో డ్రైవర్ చేస్తూ మోటర్ సైకిల్ పై వస్తున్న ఇద్దరి ఢీ కట్టడంతో వారు మరణించారు. ఈ ఘటన యావత్ భారత దేశం సంచలనం రేపింది.

Mumbai Accident: ఇటీవల పుణెలో ఓ సంపన్న కుటుంబానికి చెందిన మైనర్ బాలుడు మద్యం మత్తులో ఖరీదైన పోర్ష్ కారుతో డ్రైవర్ చేస్తూ మోటర్ సైకిల్ పై వస్తున్న ఇద్దరి ఢీ కట్టడంతో వారు మరణించారు. ఈ ఘటన యావత్ భారత దేశం సంచలనం రేపింది.

పూణే తరహాలో ఘటన.. బీఎండబ్ల్యూ బీభత్సం.. మహిళ మృతి!

దేశంలో ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. డ్రైవర్లు చేసే తప్పిదాల వల్ల ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన వారు తిరిగి ఇంటికి వెళ్తామా లేదా? అన్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవల పూణె‌లో సంపన్న కుటుంబానికి చెందిన మైనర్ బాలుడు మద్యం మత్తులో ఖరీదైన పోర్ష్ కారు డ్రైవ్ చేసి ఇద్దరు ప్రాణాలు తీశాడు. తాజాగా అలాంటి ఘటనే ముంబైలో చోటు చేసుకుంది.. బీఎండబ్ల్యూ కారు స్కూటీపై వస్తున్న మహిళను ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

పూనే తరహాలో మరో కారు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఆదివారం (జులై 7) ముంబైలోని వర్లీలో వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు స్కూటీని ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన లో స్కూటీపై ప్రయాణిస్తున్న మహిళ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఘటన అనంతరం కారు డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో మృతురాలి భర్తకు తీవ్రంగా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసుపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే కారు శివసేనకు చెందిన ఓ లీడర్ ది గా గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాదానికి అతని కుమారుడు కారణం అని.. ప్రస్తుతం అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయినట్లు తెలుస్తుంది.

సదరు లీడర్ తనయుడు మద్యం సేవించాడని.. లాంగ్ డ్రైవ్ వెళ్తామని డ్రైవర్ తో చెప్పి వర్లీ వద్దకు రాగానే డ్రైవింగ్ తాను చేస్తానని స్టీరింగ్ పట్టుకోవడంతో అనుకోకుండా కారు అదుపు తప్పి అటుగా వస్తున్న స్కూటర్ కి ఢీ కొట్టింది. స్కూటీ పై వస్తున్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. నఖ్వాకి తీవ్రంగా గాయాలు అస్పత్రికి తరలించారు.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు తీవ్రంగా గాయపడ్డ ఆమె భర్త ప్రదీక్ చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ నుంచి కారుతో పారార్ అయ్యారు నిందితులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.