iDreamPost
android-app
ios-app

ప్రముఖ కమెడియన్ కారు ఢీ కొని ఆటో డ్రైవర్ దుర్మరణ

  • Published Mar 14, 2024 | 4:34 PM Updated Updated Mar 14, 2024 | 4:34 PM

Tumakuru Crime News: ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య మరీ ఎక్కువ అవుతున్నాయి.. స్టార్ కమెడియన్ కారు ఢీ కొని ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు.

Tumakuru Crime News: ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య మరీ ఎక్కువ అవుతున్నాయి.. స్టార్ కమెడియన్ కారు ఢీ కొని ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు.

  • Published Mar 14, 2024 | 4:34 PMUpdated Mar 14, 2024 | 4:34 PM
ప్రముఖ కమెడియన్ కారు ఢీ కొని ఆటో డ్రైవర్ దుర్మరణ

ఈ మద్య కాలంలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ఒకదశంలో రోడ్డుపైకి వచ్చిన తర్వాత క్షేమంగా ఇంటికి చేరుతామా అన్న సందేహాలు కలుగుతున్నాయి. డ్రైవర్లు చేసే పొరపాటు వల్ల ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. తప్పు అని తెలిసి కూడా వాహనాలు నడిపే సమయంలో నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం లాంటివి చేయడం వల్ల రెప్పపాటున ప్రమాదాలు జరిగిపోతున్నాయి. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. తాజాగా ప్రముక హాస్యనటుడు కారు ఢీ కొని ఆటో డ్రైవర్ కన్నుమూశాడు. వివరాల్లోకి వెళితే..

కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కమెడియన్ తుకలి సంతోష్ కారు ఢీ కొన్ని ఆటో డ్రైవర్ కన్నుమూశాడు. ఈ ఘటన తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకలోని కురుడి హళ్లి గ్రామ సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆటో డ్రైవర్ కొడహళ్లిపల్లి గ్రామానికి చెందిన జగదీష్ (44) గా గుర్తించారు. కమెడియన్, బిగ్ బాస్ కంటెస్టెంట్ తుకలి సంతోష్ ఆయన సతీమణి మానస తుమకూరులో సినిమా షూటింగ్‌ ముగించుకుని తుమ్మల వైపు నుండి కుణిగల్ మార్గంలో హొన్నెనహళ్లి సమీపంలో కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పాక్షికంగా దెబ్బతీన్నది. ఆటో డ్రైవర్ జగదీష్ కి తీవ్రంగా గాయాలు కావడంతో కుణిగల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం జగదీష్ కన్నుమూశాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comedian tukal santosh car accident

ఇక తుకలి సంతోష్ కెరీర్ విషయానికి వస్తే కన్నడ టెలివిజన్ రంగంలో ఎన్నో రియాల్టీ షోల్లో పాల్గొన్నాడు. తనదైన కామెడీ పర్పామెన్స్ తో ప్రేక్షకులను అలరించాడు. కిచ్చా సుదీప్ హూస్ట్ చేస్తున్న కన్నడ బిగ్ బాస్ సీజన్ 10 లో పాల్గొన్నాడు. బిగ్ బాస్ హౌజ్ లో తనదైన స్టైల్లో గేమ్స్, టాస్కుల్లో ప్రతిభ కనబరిచాడు. ఆరుగురు ఫైనలిస్ట్ లలో ఒకరిగా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ 10 లో 4వ రన్నరప్ గా నిలిచాడు. తుకలి సంతోష్ ఇప్పుడిప్పుడే మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకుంటున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన భార్యతో కలిసి షోరూమ్ కి వెళ్లి కియా కారు కొనుగోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom