iDreamPost

హైదరాబాద్: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి!

హైదరాబాద్: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి!

గత కొన్ని రోజుల నుంచి వరుస గుండెపోటు మరణాలతో ప్రజలను భయందోళనలకు గురవుతున్నారు. ఇటు చిన్న పిల్లల నుంచి ఇటు వృద్ధుల వరకు గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ కానిస్టేబుల్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో తోటి ఉద్యోగులు అప్రమత్తమై వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోవడంతో అతడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో యాదయ్య అనే వ్యక్తి కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో తోటి ఉద్యోగులు అప్రమత్తమై వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: జైలు గోడ దూకి పారిపోయిన యువతి.. ఆమె తెలివికి షాకైన పోలీసులు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి