iDreamPost

వీడియో: ట్రాఫిక్ పోలీసులను నిలదీసిన మహిళ.. తన తప్పేంటో చెప్పాలంటూ!

Street Food Lady Argument With Traffic Police: స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం నిర్వహించే మహిళకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆమె పోలీసులను నిలదీసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Street Food Lady Argument With Traffic Police: స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం నిర్వహించే మహిళకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆమె పోలీసులను నిలదీసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వీడియో: ట్రాఫిక్ పోలీసులను నిలదీసిన మహిళ.. తన తప్పేంటో చెప్పాలంటూ!

హైదరాబాద్ లాంటి మహా నగరంలో ట్రాఫిక్ అనేది చాలా పెద్ద సమస్య. సిటీలో ఎన్ని పై వంతెనలు కట్టినా ట్రాఫిక్ సమస్యను పూర్తి వదిలించుకోలేకపోతున్నాం. మరికొన్నిచోట్ల ప్రధాన దారుల్లో వ్యాపారస్థులు, వీధివ్యాపారులు ఉన్నచోట కూడా ట్రాఫిక్ సమస్య బాగా ఉంటుంది. అంటే ఫుట్ పాత్ మీద ఫుడ్ బిజినెస్ చేసే వాళ్లు ఉంటారు. వారి దగ్గరకు వచ్చే కస్టమర్స్, వాళ్లు రోడ్డు మీద ఆపే వాహనాల కారణంగా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది. గతంలో కుమారీ ఆంటీ స్టాల్ వల్ల కూడా ఇలాంటి సమస్యే తలెత్తింది. ట్రాఫిక్ పోలీసులు వారి వాహనాన్ని కూడా ఆపేశారు. ఆ తర్వాత వ్యవహారం సద్దుమణిగింది. ఇప్పుడు అలాంటి ఒక ఘటనే అదే ప్రాంతంలో జరిగింది.

హైదరాబాద్ లో కేబుల్ బ్రిడ్జి ఎంత ఫేమస్సో.. ఆ పక్కనే ఐటీసీ కోహినూర్ రోడ్డులో ఉండే కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ కూడా అంతే ఫేమస్. సెలబ్రిటీలు, వ్లాగర్స్, యూట్యూబ్ ఛానల్స్ అంతా ఆమెను ఇంటర్వ్యూలు చేయడం, బైట్స్ తీసుకోవడం చేశారు. అంతేకాకుండా బిజినెస్ కూడా బాగా పెరిగిపోయింది. కస్టమర్స్ తాకిడి విపరీతంగా ఉండటంతో ఆ రోడ్డు మొత్తం వాహనాలతో నిండిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ తర్వాత ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాళ్ల వాహనాన్ని కూడా ఆపేశారు. అప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయ్యింది. ముఖ్యమంత్రి స్వయంగా స్పందించారు. ఇప్పుడు అలాంటి ఒక ఘటన అదే రోడ్డులో జరిగింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

అదే రోడ్డులో ఒక మహిళ ఫుడ్ బిజినెస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది అని ట్రాఫిక్ పోలీసులు ఆమె కొట్టును అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ మహిళ మాత్రం ట్రాఫిక్ పోలీసుల మీద విరుచుకుపడింది. తాను చేసిన తప్పు ఏంటో చెప్పాలి అంటూ కేకలు వేసింది. తాను తెచ్చిన ఆహరాన్ని రోడ్డు మీదకు విసిరేసి తీవ్ర ఆగ్రహంతో కేకలు వేసింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం తమ పై అధికారితో మాట్లాడాల్సిందిగా సూచించాడు. ఆమె మాత్రం తాను చేసిన తప్పు ఏంటో చెప్పాలి అంటూ ప్రశ్నించింది. తాను ఏమైనా దొంగతనం చేశానా అని పోలీసులను నిలదీసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్ట్రీట్ వెండర్స్ కి సపోర్ట్ చేస్తుంటే.. కొందరు మాత్రం ఫుట్ పాత్ మీద వ్యాపారాలు పెడితే.. పాదచారులు ఎక్కడ నడవాలి అని ప్రశ్నిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి