iDreamPost

హైదరాబాద్ నుంచి వెళ్లే 78 రైళ్లు రద్దు! లిస్ట్ ఇదే.. తప్పక తెలుసుకోండి!

  • Published Jun 27, 2024 | 6:54 PMUpdated Jun 27, 2024 | 6:54 PM

ఈ మధ్య కాలంలో రైల్వే శాఖలో ఏదో ఒక సమస్యలు వినిపిస్తునే ఉన్నాయి. ముఖ్యంగా టికెట్‌ బుకింగ్‌, రైల్వే ప్రమాదాలు, రైళ్ల రద్దు వంటి వార్తలు తరుచు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రైల్వే ప్రయాణీకులకు సౌత్ సెంట్రల్ రైల్వే అలర్ట్ ను ఇచ్చింది. ఏకంగా అన్ని రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కారణమేమిటంటే

ఈ మధ్య కాలంలో రైల్వే శాఖలో ఏదో ఒక సమస్యలు వినిపిస్తునే ఉన్నాయి. ముఖ్యంగా టికెట్‌ బుకింగ్‌, రైల్వే ప్రమాదాలు, రైళ్ల రద్దు వంటి వార్తలు తరుచు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రైల్వే ప్రయాణీకులకు సౌత్ సెంట్రల్ రైల్వే అలర్ట్ ను ఇచ్చింది. ఏకంగా అన్ని రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కారణమేమిటంటే

  • Published Jun 27, 2024 | 6:54 PMUpdated Jun 27, 2024 | 6:54 PM
హైదరాబాద్ నుంచి వెళ్లే 78 రైళ్లు రద్దు! లిస్ట్ ఇదే.. తప్పక తెలుసుకోండి!

దేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వే కూడా ఒకటి.అయితే ఈ రైళ్లలో తరుచు కోట్లాది మంది ప్రయాణీకులు ప్రయాణిస్తుంటారు. ఎందుకంటే.. దూర ప్రాంతాలకు తొందరగా, సురక్షితంగా వెళ్లేందుకు ఈ ట్రైన్ జర్నీ చాలా సులువుగా ఉంటుంది. అంతేకాకుండా..  బస్సులు, ఆటోలు టికెట్ ఛార్జ్ లతో పోలిస్తే.. రైళ్ల టికెట్ ధర చాలా తక్కువగా ఉంటుంది. అందుకే  ఎక్కువ శాతం మంది ప్రయాణికులు ఈ  ట్రైన్ జర్నీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.  కానీ, ఈ మధ్య కాలంలో రైల్వే శాఖలో ఏదో ఒక సమస్యలు వినిపిస్తునే ఉన్నాయి. ముఖ్యంగా టికెట్‌ బుకింగ్‌, రైల్వే ప్రమాదాలు, రైళ్ల రద్దు వంటి వార్తలు తరుచు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రైల్వే ప్రయాణీకులకు సౌత్ సెంట్రల్ రైల్వే అలర్ట్ ను ఇచ్చింది. ఏకంగా అన్ని రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ వివరాళ్లకో వెళ్తే..

తాజాగా రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే బిగ్ అలార్ట్ ను అందించింది. కాగా,  హైదరాబాద్ – న్యూఢిల్లీ మధ్య పలు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇక ఈ రెండు నగరాల మధ్య మొత్తం ఏకంగా 78 రైళ్ల రాకపోకలను రద్దు చేసింది. దీంతో పాటు మరో 36 రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొంది. అయితే ఈ రైళ్ల రద్దు అనేది నేటి నుంచి అనగా జూన్ 27వ తేదీన బుధవారం నుంచి జులై 7వరకు కొనసాగుతుందని తెలియజేసింది. అయితే ఇలా ఆకస్మాత్తుగా రైళ్లు రద్దు కావడానికి, అలాగే దారి మళ్లించడానికి కారణం.. కాజీపేట, బలార్షా సెక్షన్ల మధ్య మూడో లైన్ నిర్మాణం జరుగుతుండటమేనని రైల్వే శాఖ వెల్లడించింది.

అలాగే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని ఆసిఫాబాద్, రెచ్ని స్టేషన్ల కొత్తగా మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో.. ఈ రైళ్ల రద్దు, దారి మళ్లింపు కొనసాగుతందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు. ఇక ఈ రూట్ లో రైల్వే నెట్ వర్క్ సామర్థ్యం పెంచడం వంటి మౌలిక సదుపాయాల ఏర్పాట్లు జరుగుతున్నాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. కనుక రేపటి నుంచి ఎవరైనా రైలు ప్రయాణం చేయాలనుకుంటే.. ఏఏ రైళ్లు రద్దు జరిగియో ఆ వివరాలను ఈ కింద జాబితాలో తెలుసుకోవడం మంచింది.

ఈ రోజు నుంచి జూలై 7 వరకు రద్దు చేయబడిన రైళ్ల జాబిత:

  • రైలు నం. 17003: కాజీపేట్-సోలాపూర్ ఎక్స్‌ప్రెస్
  • రైలు నం. 17004: బల్హర్షా-కాజీపేట ఎక్స్‌ప్రెస్
  • రైలు నెం. 12757: సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్
  • రైలు నెం. 12758: సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
  • రైలు నెం. 20805:విశాఖపట్నం-న్యూఢిల్లీ
  • రైలు నెం. 20806:న్యూ ఢిల్లీ-విశాఖపట్నం
  • రైలు నెం. 12803: విశాఖపట్నం-నిజాముద్దీన్
  • రైలు నెం. 12804: నిజాముద్దీన్-విశాఖపట్నం

అలాగే దారి మళ్లించిన రైళ్ల వివరాలు

  • రైలు నెం. 12590: సికింద్రాబాద్-గోరఖ్‌పూర్ (మజ్రీ, పింపాల్, ఖుతీ, ముద్ఖేడ్ , నిజామాబాద్ మీదుగా మళ్లించబడింది)
  • రైలు నం. 12589: గోరఖ్‌పూర్-సికింద్రాబాద్ (మజ్రీ, పింపాల్, ఖుతీ, ముద్ఖేడ్ , నిజామాబాద్ మీదుగా మళ్లించబడింది)
  • రైలు నెం. 12723: సికింద్రాబాద్-న్యూ ఢిల్లీ (మజ్రీ, పింపాల్, ఖుతీ, ముద్ఖేడ్ , నిజామాబాద్ మీదుగా మళ్లించబడింది)
  • రైలు నెం. 12724: న్యూఢిల్లీ-సికింద్రాబాద్ (మజ్రీ, పింపాల్, ఖుతీ, ముద్ఖేడ్ , నిజామాబాద్ మీదుగా మళ్లించబడింది)
  • రైలు నెం. 12723: హైదరాబాద్-న్యూ ఢిల్లీ (నిర్దిష్ట రోజుల్లో ఒక గంట రీషెడ్యూల్ చేయబడింది)
  • రైలు నం. 12724: న్యూఢిల్లీ-హైదరాబాద్ (నిర్దిష్ట రోజుల్లో రెండు గంటలు రీషెడ్యూల్ చేయబడింది)
  • రైలు నం. 12791: సికింద్రాబాద్-దానాపూర్ (జూలై 4 నుండి 6 వరకు 75 నిమిషాలు రీషెడ్యూల్ చేయబడింది)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి