iDreamPost

జైలు గోడ దూకి పారిపోయిన యువతి.. ఆమె తెలివికి షాకైన పోలీసులు!

జైలు గోడ దూకి పారిపోయిన యువతి.. ఆమె తెలివికి షాకైన పోలీసులు!

ఈ యువతి పేరు అనుష్క ఉరఫ్ అకృతి, వయసు 25 ఏళ్లు. కొంత వరకు చదువుకున్న ఈ అమ్మాయి.. ఏదైనా ఉద్యోగంలో స్థిరపడుతుందని ఆమె తల్లిదండ్రులు ఆశపడ్డారు. కానీ, ఆ యువతి మాత్రం కుటుంబ సభ్యుల ఆశలపై నీళ్లు జల్లి ఎవరూ ఊహించని పాడు పనికి తెర లేపింది. ఏకంగా సభ్య సమాజం తలదించుకునేలా చేసి చివరికి జైలులో శిక్ష అనుభవిస్తుంది. ఈ క్రమంలోనే ఖైదీగా ఉన్న ఆ యువతి జైలు అధికారుల కళ్లుగప్పి అక్కడి నుంచి గోడ దూకి పారిపోయింది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. అందుకు ఆ యువతి వేసిన ప్లాన్ కు పోలీస్ అధికారులే షాక్ అవుతున్నారు. అసలేం జరిగిందంటే?

నేపాల్‌లోని దుమరింగ్ గ్రామానికి చెందిన అనుష్క ఉరఫ్ ఆకృతి (25) అనే యువతి గత రెండున్నరేళ్ల కిందట ధార్చులాలో మాదకద్రవ్యం తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడింది. ఈ కేసులో న్యాయస్థానం ఆ యువతిని దోషిగా తేల్చింది. ఆ తర్వాత కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించింది. దీంతో అప్పటి నుంచి ఈ అమ్మాయి ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

అయితే ఆ యువతి జైలు అధికారుల కళ్లు గప్పి బయటకు రావడానికి ఎన్నో ఎత్తుగడలు వేసినట్లు జైలు అధికారులు తెలిపారు. ఇక ఇటీవల ఆ యువతి దుస్తువులతో ఒక తాడు తయారు చేసి ఆ యువతి జైలు గోడ దూకి పోరిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న జైలు ఉన్నతాధికారులు షాక్ గురయ్యారు. అనంతరం పోలీసులు ఆ యువతి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆమె ఆచూకిని తెలియజేసిన వారికి రూ.10 వేలు బహుమతిగా ఇస్తామని పోలీసులు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: పెళ్లికాని కుర్రాడితో మహిళ ఎంజాయ్! అన్నీ చేసి చివరికి..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి