తమిళ హీరోలు తెలుగు మార్కెట్ మీద కన్నేయడం కొత్తేమి కాదు. ఒకప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ లకు మన స్టార్లకు ధీటుగా ఓపెనింగ్స్ వచ్చేవి. రోబో రిలీజ్ అనౌన్స్ చేసినప్పుడు టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ ఏవీ దానితో నేరుగా క్లాష్ అయ్యే సాహసాన్ని చేయలేకపోయాయి. భారతీయుడు తర్వాత కమల్ కు, అపరిచితుడు తర్వాత విక్రమ్ కు, గజినీ తర్వాత సూర్యకు ఇక్కడ అశేషమైన మార్కెట్ దక్కింది. వరస ఫ్లాపులతో దాన్ని వాళ్లే తగ్గించుకున్నారు. విజయ్ కోలీవుడ్ లో […]
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన 48వ పుట్టినరోజును జూన్ 22న జరుపుకోనున్నారు. సౌత్ పరిశ్రమల్లో ఎవరైనా స్టార్ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటే వారి కోసం బర్త్‌డేకి ముందు CDP రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ స్టార్ కి సంబంధించిన కొన్ని ఫొటోలతో ఓ ఫోటోని తయారు చేసి స్పెషల్ గా విషెష్ చెప్తారు. అభిమానులు అంతా ఆ స్టార్ బర్త్‌డే రోజున అదే ఫోటోని రకరకాలుగా ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ […]
ఈ ఏడాది పాన్ ఇండియా సినిమాల జాతర గట్టిగానే ఉంది. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ల తర్వాత ఆ స్థాయిలో అంచనాలు మోస్తున్న సినిమా కెజిఎఫ్ 2. మూడేళ్ళ క్రితం వచ్చిన ఫస్ట్ పార్ట్ ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడీ సీక్వెల్ మీద క్రేజ్, జరుగుతున్న బిజినెస్ మాములుగా లేదు. నార్త్ సర్కిల్స్ లోనూ విపరీతమైన డిమాండ్ ఉంది. అసలు కథంతా చాప్టర్ 2లో ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ముందు నుంచీ ఊరిస్తుండటంతో […]
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని పెద్దలు అన్నట్టు ఇప్పుడు తమిళ హీరోలు – తెలుగు దర్శకులు, అలాగే తెలుగు హీరోలు – తమిళ దర్శకుల కాంబినేషన్లు రెండు భాషల సినిమా ఇండస్ట్రీలోనూ ఆసక్తికరంగా మారాయి. గతం నుంచి చూస్తే కనుక తమిళ దర్శకులు తెలుగు హీరోలను డైరెక్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి కానీ తెలుగు దర్శకులు నేరుగా తమిళ హీరోలను తెలుగులో నటింపజేయడం అనే ట్రెండ్ ఇప్పుడే మొదలైంది. అలాగే తమిళ దర్శకులు – తెలుగు […]
ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే ఒక్క తమన్ పేరు తప్ప మరొకటి వినిపించడం లేదు. స్టార్ హీరోలందరూ తను తప్ప ఇంకే ఆప్షన్ వద్దనుకుంటున్నారు. మీడియం నిర్మాతలకు ఆల్రెడీ అందని ద్రాక్ష అయిపోయాడు. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులన్నీ తన చేతిలోనే ఉన్నాయి. చిరంజీవి గాడ్ ఫాదర్, మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, నాగ చైతన్య థాంక్ యు, బాలకృష్ణ అఖండ, వరుణ్ తేజ్ […]
నటుడు విజయ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పోల్చారు విజయ్ అభిమానులు. తమిళ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు కుంభకోణంలోని అతని అభిమానులు విజయ్ ఫోటోను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిపి వీధుల్లో అంటించారు. విజయ్, ఈ నెల 22న 46వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కరోనా తమిళనాడు అంతా విపరీంతా వ్యాప్తి చెందడంతో, విజయ్ తన పుట్టినరోజు వేడుకల కార్యకలాపాలకు పాల్పడవద్దని అభిమానులను ఆదేశించారు. అయితే, అతని అభిమానులు విజయ్‌ను పుట్టిన […]
విజయ్ హీరోగా విజయ్ సేతుపతి విలన్ గా కార్తి ఖైదీతో పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా తాకిడి లేకపోతే ఏప్రిల్ 9నే విడుదలయ్యి ఉండేది. కాని ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడంతో దీపావళికి ప్లాన్ చేసినట్టుగా కోలీవుడ్ టాక్. ఇదిలా ఉండగా ఈ కథకు సంబంధించి ఓ కీలకమైన లీక్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఇందులో హీరో పాత్ర […]
తమిళ స్టార్ హీరో విజయ్ కొంత ఆలస్యంగానే అయినా కరోనా సహాయ చర్యలకు తన వంతు విరాళం బాగానే అందించాడు. అయితే అందరిలాగా తమ రాష్ట్రానికే లేదా పిఎం కేర్స్ కో పరిమితం కాకుండా తనను ఆదరిస్తున్న 6 రాష్ట్రాలకు సొమ్ముని ప్రకటించాడు. వివరాల్లోకి వెళ్తే మాతృ రాష్ట్రం తమిళనాడుకు 50 లక్షలు, కేరళకు 10 లక్షలు, కర్ణాటకకు 5 లక్షలు, ఆంధ్రప్రదేశ్ కు 5 లక్షలు, తెలంగాణకు 5 లక్షలు, పాండిచ్చేరికి 5 లక్షలు ఆయా […]
అదేంటి ఉప్పెన ఇంకా రిలీజే కాలేదు అప్పుడే రీమేక్ న్యూస్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా. విషయం వేరే ఉంది లెండి. మెగా మేనల్లుడు కం సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా డెబ్యు డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన వాస్తవానికి ఏప్రిల్ 2న విడుదల కావాల్సింది. కరోనా వల్ల ఇప్పటికీ ఫిక్స్ కాని డేట్ కి పోస్ట్ పోన్ అయ్యింది. తమిళ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి విలన్ గా చాలా కీలకమైన పాత్ర […]