iDreamPost
android-app
ios-app

ఇదేందయ్యా… పది వేలు పెట్టినా.. సీటు దొరకలేదు…

  • Published Nov 02, 2023 | 6:45 PM Updated Updated Dec 22, 2023 | 6:54 PM

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Published Nov 02, 2023 | 6:45 PMUpdated Dec 22, 2023 | 6:54 PM
ఇదేందయ్యా… పది వేలు పెట్టినా.. సీటు దొరకలేదు…

తమిళ సూపర్‌ స్టార్‌ ఇళయ దళపతి విజయ్‌-లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన లియోపై గత కొద్దిరోజులనుంచి వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. లియో కలెక్షన్లపై తమిళ సినిమా థియేటర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు సుబ్రమణియన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. లియో టీం కలెక్షన్ల విషయంలో మోసానికి పాల్పడుతోందని అన్నారు. దాదాపు 5 కోట్ల స్కాం చేసిందని ఆరోపించారు. ఈ విషయంపై లోకేష్‌ కనగరాజ్‌ స్పందించారు. సినిమా సెకండ్‌ హాఫ్‌ మోస్తరుగా ఉందని అన్నారు.

కలెక్షన్ల విషయం తనకు సంబంధం లేదని, ప్రొడ్యూసర్లను అడగండని తేల్చి చెప్పార. ఇక, కలెక్షన్లపై ఇంత రచ్చ జరుగుతున్న ఈ నేపథ్యంలో తాజాగా ‘లియో’ సక్సెస్‌ మీట్‌ జరిగింది. చెన్నైలో అత్యంత ఘనంగా సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు నిర్మాతలు. అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, ఈ సక్సెస్‌ మీట్‌ విషయంలోనూ వివాదం నెలకొంది. సక్సెస్‌ మీట్‌ పేరుతో నిర్మాతలు అభిమానుల్ని దోచుకున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

తాజాగా, చెన్నై, పెరియమెట్‌లోని జవహార్‌లాల్‌ స్టేడియంలో లియో సక్సెస్‌ మీట్‌ జరిగింది. టిక్కెట్లు కొన్ని.. ఒక్కోటి 10 వేల రూపాయల చొప్పున అమ్ముడయ్యాట. 10 వేల రూపాయలు పెట్టి టిక్కెట్టు కొన్నా కొంతమందికి సీటు దొరకలేదట. స్టేడియంలో సీట్లు ఖాళీ లేవంటూ కొంతమందిని వెనక్కు పంపేశారట.  పది వేలు పెట్టి టిక్కెట్‌ కొన్నా సీటు దొరక్కపోవటంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, లియో సక్సెస్‌ మీట్‌ పేరుతో దోపిడీ జరిగిందన్న ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet