iDreamPost
android-app
ios-app

సంగీత దర్శకుడి సుడి మాములుగా లేదు

  • Published Sep 28, 2021 | 8:45 AM Updated Updated Sep 28, 2021 | 8:45 AM
  • Published Sep 28, 2021 | 8:45 AMUpdated Sep 28, 2021 | 8:45 AM
సంగీత దర్శకుడి సుడి మాములుగా లేదు

ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే ఒక్క తమన్ పేరు తప్ప మరొకటి వినిపించడం లేదు. స్టార్ హీరోలందరూ తను తప్ప ఇంకే ఆప్షన్ వద్దనుకుంటున్నారు. మీడియం నిర్మాతలకు ఆల్రెడీ అందని ద్రాక్ష అయిపోయాడు. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులన్నీ తన చేతిలోనే ఉన్నాయి. చిరంజీవి గాడ్ ఫాదర్, మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, నాగ చైతన్య థాంక్ యు, బాలకృష్ణ అఖండ, వరుణ్ తేజ్ ఘని, రామ్ చరణ్-శంకర్ మూవీ ఇలా మార్కెట్ లో ఉన్న రాబోతున్న టాప్ ఆల్బమ్స్ అన్నీ తమన్ పేరు మీదే ఉన్నాయి. ఫ్యాన్ బేస్ కూడా ఓ రేంజ్ లో పెరిగిపోయిందని సోషల్ మీడియా చూస్తే చెప్పొచ్చు

ఇదిలా ఉండగా తాజాగా తమన్ కు మరో జాక్ పాట్ తగిలిందని సమాచారం. దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందబోయే పాన్ ఇండియా సినిమాకు తననే ఫిక్స్ చేసుకున్నట్టు వినికిడి. సహజంగా విజయ్ కు మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే మంచి గురి. గతంలో మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్ లతో పిలిచి మరీ చేయించుకున్నాడు. ఇప్పటి దాకా తమన్ తో మాత్రం కుదరలేదు. అందుకే అనిరుద్ రవిచందర్ లాంటి వాళ్లకు బదులు తమన్ అయితే బెటర్ గా ఉంటుందనే దిల్ రాజు ప్రతిపాదనకు ఆల్మోస్ట్ ఓకే చెప్పినట్టు చెన్నై న్యూస్. అఫీషియల్ అయ్యేదాకా ఖరారుగా చెప్పలేం కాబట్టి వేచి చూడాలి

ఒకప్పుడు సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, కీరవాణి, రాజ్ కోటిలు చూసిన పీక్స్ ని ఇప్పుడు తమన్ ఎంజాయ్ చేస్తున్నాడు. అల వైకుంఠపురములో నుంచి ఈ దూకుడు మరింత ఎక్కువయ్యింది. ఇంకొన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో ఉండగా కొన్నింటిని టైం లేక వదిలేసుకోవాల్సి వస్తోంది. ఆడియో క్యాసెట్లు, సిడిలు పోయి అంతా యుట్యూబ్, యాప్స్ ల హంగామాగా మారిపోయిన తరుణంలో తమన్ చూపిస్తున్న ఫామ్ మాములుగా లేదు. ఇప్పట్లో తనను ఓవర్ టేక్ చేసేవాళ్ళు దగ్గరలో కనిపించడం లేదు. దేవి రేస్ లోనే ఉన్నా ఈ రేంజ్ అవుట్ ఫుట్ మాత్రం అన్ని సినిమాలకు ఇవ్వలేకపోవడం వాస్తవం

Also Read : ముందే వస్తున్న ‘పుష్ప’ రాజ్

Jojobet Girişİmajbetjojobetjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetcasibom