iDreamPost
android-app
ios-app

విజయ్‌, జాసన్‌ల మధ్య గొడవలు జరుగుతున్నాయా? నిజమెంత?

  • Published Sep 04, 2023 | 12:00 PM Updated Updated Sep 04, 2023 | 12:00 PM
  • Published Sep 04, 2023 | 12:00 PMUpdated Sep 04, 2023 | 12:00 PM
విజయ్‌, జాసన్‌ల మధ్య గొడవలు జరుగుతున్నాయా? నిజమెంత?

ఇళయ దళపతి విజయ్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయనకు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. తమిళనాట అయితే సూపర్‌ మాస్‌ క్రేజ్‌ ఉన్న టాప్‌ హీరో ఆయన. విజయ్‌ నట వారసుడిగా ఆయన కుమారుడు జాసన్‌ సంజయ్‌ సినిమాల్లోకి వస్తారని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లు గానే జాసన్‌ సినిమాల్లోకి  ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, నటుడిగా కాదు.. సినిమా దర్శకుడిగా ఆయన మారుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా జరిగిపోయింది.

తాతా ఎస్‌ఏ చంద్రశేఖర్‌ బాటలో నడుస్తూ.. ఓ సినిమాకు దర్శక​త్వం వహించబోతున్నారు. లైకా ప్రొడక్షన్‌ ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‍ప్రముఖ తమిళ జర్నలిస్ట్‌ అంతనన్‌.. విజయ్‌-జాసన్‌ల మధ్య ఉన్న తాజా సంబంధాల గురించి సంచలన విషయాలు చెప్పారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ విజయ్‌, సంజయ్‌ల మధ్య మాటలు లేవని సినిమా సర్కిల్‌లో టాక్‌ నడుస్తోంది. ఇది కూడా ఒకరకంగా నిజమే.. జాసన్‌ ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు.. లైకా ప్రొడక్షన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు విజయ్‌కు తెలీదు.

సంజయ్‌ ప్రస్తుతం తల్లితో కలిసి లండన్లో ఉన్నాడు. సంజయ్‌ తాత గారు లండన్‌లో బాగా ఉన్నవారు. లైకా ప్రొడక్షన్‌ హౌస్‌ అధినేత సుభాస్కరన్‌.. జాసన్‌ తాత మంచి మిత్రులు. ఆయనే స్వయంగా సుభాస్కరన్‌తో మాట్లాడి జాసన్‌తో సినిమా చేసేలా ఒప్పించారు. ఎస్‌ఏ చంద్రశేఖర్‌ కూడా జాసన్‌కు మద్దతుగా నిలిచారు’’ అని అన్నారు. అంతనన్‌ చెప్పిన విషయాలు ఫిల్మ్‌ సర్కిల్‌లో ప్రస్తుతం చర్చకు దారి తీస్తున్నాయి. విజయ్‌తో కుటుంబం మొత్తం ఎందుకు దూరంగా ఉంటోంది అన్నది హాట్‌ టాపిక్‌గా మారింది. మరి, జర్నలిస్ట్‌ అంతనన్‌ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet