iDreamPost
android-app
ios-app

రెండో తుపాకీ పేలుతుందా

  • Published Mar 19, 2020 | 3:30 PM Updated Updated Mar 19, 2020 | 3:30 PM
  • Published Mar 19, 2020 | 3:30 PMUpdated Mar 19, 2020 | 3:30 PM
రెండో తుపాకీ పేలుతుందా

తమిళ హీరో విజయ్ కి తెలుగులో మార్కెట్ పెరగడానికి దోహద పడిన సినిమా తుపాకీ. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ టెర్రరిస్ట్ థ్రిల్లర్ ఇప్పటికీ యాక్షన్ లవర్స్ కి హాట్ ఫెవరెట్ మూవీ. ఇప్పుడు దీనికి సీక్వెల్ రూపొందే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. ప్రస్తుతం మాస్టర్ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ కరోనా వల్ల వాయిదా వేయక తప్పలేదు. దీని తర్వాత సుధా కొంగరకు కమిట్ మెంట్ ఇచ్చిన విజయ్ దాని తర్వాత మురుగదాస్ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇప్పటికీ ఈ కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి.

తుపాకీ తర్వాత కత్తి కోలీవుడ్ లో కొత్త రికార్డులు సృష్టించింది. చిరంజీవి తన కంబ్యాక్ కోసం దీన్నే ఏరికోరి మరీ ఎంచుకున్నాడు. తర్వాత సర్కార్ కంటెంట్ పరంగా వీటి స్థాయిలో కాదు కాని కలెక్షన్స్ లెక్కల్లో కమర్షియల్ గా సేఫ్ ప్రాజెక్ట్ అయ్యింది. తెలుగులోనూ దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇది ఒక అయితే ఈ కాంబోలో నాలుగో ప్రాజెక్ట్ అవుతుంది. తుపాకీ సీక్వెల్ అంటే ఖచ్చితంగా అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. మురుగదాస్ దర్బార్ దెబ్బకు బాగా కుదేలయ్యాడు.

రజని సినిమా సంక్రాంతికి వచ్చినా నష్టాలు రావడం చూసి బయ్యర్లు లబోదిబోమన్నారు. తన స్థాయి సినిమా దాస్ చేసి చాలా కాలమయ్యింది. విజయ్ కు మురుగదాస్ మీద మంచి గురి ఉంది. అందుకే మరో ఆఫర్ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. ఈసారి కూడా తీవ్రవాదుల అంశాన్ని తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తుపాకీకి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హారిస్ జై రాజ్ ను మళ్లి రిపీట్ చేసే అవకాశం ఉంది. మరి 2 నెంబర్ తో వచ్చే సీక్వెల్స్ కు అసలే సౌత్ లో నెగటివ్ సెంటిమెంట్ చాలా ఉంది. మరి తుపాకీ లాంటి కమర్షియల్ సినిమా దాన్ని బ్రేక్ చేస్తుందా లేదా చూడాలి.

Jojobet Girişİmajbetcasibomjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetcasibomgrandpashabet