iDreamPost
android-app
ios-app

వివాదంలో లియో.. నిర్మాతలకు వ్యతిరేకంగా నిరసన!

వివాదంలో లియో.. నిర్మాతలకు వ్యతిరేకంగా నిరసన!

దళపతి విజయ్‌- లోకేష్‌ కనగరాజ్‌ కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ‘లియో’. అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు ప్రేక్షకుడు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా విడుదలై రికార్డు సృష్టిస్తుందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. అయితే, విడుదలకు ముందే లియో సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్ర నిర్మాతలకు నిరసన సెగ తగులుతోంది.

ఇంతకీ సంగతేంటంటే.. ఈ సినిమా కోసం పని చేసిన డ్యాన్సర్లు తమకు పూర్తిగా డబ్బులు ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు. ప్రొడ్యూసర్స్‌కు చెందిన ఆఫీస్‌ దగ్గర నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఓ డ్యాన్సర్‌కు.. నిర్మాణ సంస్థ ఉద్యోగికి మధ్య సంభాషణ ఈ విధంగా జరిగింది.

డ్యాన్సర్‌ : గత కొన్ని నెలలుగా మాకు రావాల్సిన డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం.
నిర్మాణ సంస్థ ఉద్యోగి : మీకు డబ్బులు ఇవ్వాలని యూనియన్‌ డిసైడ్‌ అయింది. డబ్బులు యూనియన్‌కు పంపాం.
డ్యాన్సర్‌ : ఆ పాట కోసం ఎంతమందిమి పని చేశామో తెలుసా? మీరు ఇలా సమాధానం చెప్పటం ఏం బాలేదు.

అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా, ‘‘ నా రెడీ’’ పాట చిత్రీకరణ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేశారు. ఈ పాట కోసం ఏకంగా 1500 మంది డ్యాన్సర్లను రంగంలోకి దింపారు. దాదాపు ఈ పాట చిత్రీకరించడానికి 7 రోజులు పట్టింది. అయితే, ఈ పాట విషయంలోనే తమకు పూర్తి స్థాయిలో డబ్బులు రాలేదంటూ డ్యాన్సర్లు నిరసనకు దిగారు.