iDreamPost
android-app
ios-app

Beast : తగ్గేదేలే అంటున్న మరో పాన్ ఇండియా సినిమా

  • Published Feb 08, 2022 | 7:11 AM Updated Updated Feb 08, 2022 | 7:11 AM
  • Published Feb 08, 2022 | 7:11 AMUpdated Feb 08, 2022 | 7:11 AM
Beast : తగ్గేదేలే అంటున్న మరో పాన్ ఇండియా సినిమా

ఈ ఏడాది పాన్ ఇండియా సినిమాల జాతర గట్టిగానే ఉంది. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ల తర్వాత ఆ స్థాయిలో అంచనాలు మోస్తున్న సినిమా కెజిఎఫ్ 2. మూడేళ్ళ క్రితం వచ్చిన ఫస్ట్ పార్ట్ ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడీ సీక్వెల్ మీద క్రేజ్, జరుగుతున్న బిజినెస్ మాములుగా లేదు. నార్త్ సర్కిల్స్ లోనూ విపరీతమైన డిమాండ్ ఉంది. అసలు కథంతా చాప్టర్ 2లో ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ముందు నుంచీ ఊరిస్తుండటంతో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. దీని ఫలితం కోసమే హీరో యాష్ ఇంకా కొత్త కమిట్ మెంట్స్ ఎవరికీ ఇవ్వలేదు. అందరిని వెయిటింగ్ లిస్టులో పెట్టేసి ఏప్రిల్ కోసం చూస్తున్నాడు.

ఇదిలా ఉండగా కెజిఎఫ్ 2 పోటీగా ఆల్రెడీ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా ఉండగా తాజాగా విజయ్ బీస్ట్ ని కూడా అదే ఏప్రిల్ 14కి ఫిక్స్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. కాంపిటీషన్ ఎంత ఉన్నా సరే వెళదామని హీరో విజయ్ చెప్పడంతో ఆ దిశగా నిర్మాణ సంస్థ ఏర్పాట్లు మొదలుపెట్టినట్టుగా సమాచారం. షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆడియో సింగల్ రిలీజ్ కు రెడీగా ఉంది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శివ కార్తికేయన్ తో డాక్టర్ రూపంలో బ్లాక్ బస్టర్ సాధించిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు కావడం ఎగ్జైట్ మెంట్ ని ఇంకా ఎక్కువ చేసింది.

సో బీస్ట్ వెనక్కు తగ్గడం కష్టమే అని తేలిపోయింది. పూజా హెగ్డే హీరోయిన్ కావడం, యాక్షన్ ఎంటర్ టైనర్ గా నెల్సన్ దీన్ని భారీ ఎత్తున తీర్చిదిద్దడంతో నార్త్ లోనూ ఒకేసారి థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. అదే జరిగితే రాఖీ భాయ్ ఇటు బీస్ట్ అటు లాల్ సింగ్ ఇద్దరితోనూ స్క్రీన్లు పంచుకోవాల్సి ఉంటుంది. పైగా పెద్దగా గ్యాప్ లేకుండా ఎఫ్3, ఆచార్య లాంటి భారీ సినిమాలు అదే నెల చివరి వారంలో రాబోతున్నాయి. సో ఇప్పుడు పరిస్థితులన్నీ కెజిఎఫ్ 2కు అనుకూలంగా లేవు. మైండ్ బ్లోయింగ్ అనే టాక్ వస్తే ఇదేమంత పెద్ద విషయం కాదు కానీ చుట్టూ ఉన్న పోటీని తట్టుకోవడం రాఖీ భాయ్ కు అంత సులభం కాదు

Also Read : Tollywood : నెల రోజుల తర్వాత టాలీవుడ్ సందడి

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom