iDreamPost
android-app
ios-app

మాస్టర్ లో సర్ప్రైజ్ ట్విస్టులు

  • Published May 15, 2020 | 10:12 AM Updated Updated May 15, 2020 | 10:12 AM
  • Published May 15, 2020 | 10:12 AMUpdated May 15, 2020 | 10:12 AM
మాస్టర్ లో సర్ప్రైజ్ ట్విస్టులు

విజయ్ హీరోగా విజయ్ సేతుపతి విలన్ గా కార్తి ఖైదీతో పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా తాకిడి లేకపోతే ఏప్రిల్ 9నే విడుదలయ్యి ఉండేది. కాని ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడంతో దీపావళికి ప్లాన్ చేసినట్టుగా కోలీవుడ్ టాక్. ఇదిలా ఉండగా ఈ కథకు సంబంధించి ఓ కీలకమైన లీక్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఇందులో హీరో పాత్ర పెద్ద గ్యాంగ్ స్టర్ నుంచి లెక్చరర్ గా మారే పాత్రలో రెండు డిఫరెంట్ షేడ్స్ తో సాగుతుందట.

మాఫియా ఎపిసోడ్ రెగ్యులర్ స్టైల్ లో కాకుండా చాలా టెర్రిఫిక్ గా ఉంటుందని చెబుతున్నారు. అక్కడే విజయ్ సేతుపతి రోల్ ఎవరూ ఊహించని రీతిలో ట్విస్ట్ ఇస్తుందట. అయితే విజయ్ సేతుపతికి ఉన్న ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకుని లోకేష్ కనగరాజ్ కంప్లీజ్ నెగటివ్ షేడ్స్ లేకుండా జాగ్రత్త పడినట్టు తెలిసింది. గతంలో ఇలా లెక్చరర్ కం గ్యాంగ్ స్టర్ స్టొరీలు తక్కువగానే వచ్చాయి. చాలా ఏళ్ళ క్రితం హిందిలో నసీరుద్దిన్ షా చేసిన సర్ అప్పట్లో సూపర్ హిట్. దాన్నే తెలుగులో రాజశేఖర్ హీరోగా గ్యాంగ్ మాస్టర్ గా రీమేక్ చేస్తే ఫ్లాప్ అయ్యింది.

చిరంజీవి మాస్టర్ లో కూడా హీరో లెక్చరరే కాని క్రైమ్ బ్యాక్ డ్రాప్ విలన్ కు ఉంటుంది. టాగూర్ లోనూ అధ్యాపకుడిగానే కనిపించిన చిరు అందులో లక్ష్యం వేరుగా ఉంటుంది. ఇప్పుడీ విజయ్ మాస్టర్ లో అన్ని రకాల మిక్స్ కనిపిస్తుందట. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ బెస్ట్ అఫ్ విజయ్ అనే స్థాయిలో ఉంటుందట. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్న మాస్టర్ లో పెద్ద క్యాస్టింగే ఉంది. అనిరుద్ రవిచందర్ సంగీతం కూడా ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. తెలుగులోనూ అదే టైటిల్ తోనే విడుదల కాబోతున్న మాస్టర్ వచ్చే నాలుగు నెలల్లో రిలీజ్ కాబోయే అతి పెద్ద సినిమాగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet