iDreamPost
android-app
ios-app

Vijay: ఫ్యాన్స్‌ చేసిన పనికి విజయ్‌ షాక్‌.. వైరల్‌ వీడియో!

ప్రముఖ హీరో విజయ్‌ చెన్నై వరదల బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి.

ప్రముఖ హీరో విజయ్‌ చెన్నై వరదల బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి.

Vijay: ఫ్యాన్స్‌ చేసిన పనికి విజయ్‌ షాక్‌.. వైరల్‌ వీడియో!

తమిళ స్టార్‌ హీరో ఇళయ దళపతి విజయ్‌కు ఉన్న స్టార్‌డమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ రజనీకాంత్‌ తర్వాత అంతటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న మాస్‌ హీరో ఎవరైనా ఉన్నారు అంటే.. అది కచ్చితంగా విజయే అని చెప్పొచ్చు. ఫ్యాన్స్‌ ఆయన్ని దేవుడిలా భావిస్తూ ఉంటారు. ఇక, విజయ్‌ సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల అవుతూ ఉన్నాయి. సూపర్‌ హిట్‌గా నిలుస్తూ ఉన్నాయి. విజయ్‌ తాజాగా, లియో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినప్పటికి కలెక్షన్ల పరంగా పర్వాలేదు అనిపించింది. ఇప్పటి వరకు 612 కోట్ల రూపాయలు వసూలు చేసింది. విజయ్‌ సినిమాల్లోనే కాదు.. నిజం జీవితంలోనూ రియల్‌ హీరోనే.. ఏదైనా ఆపద సమయంలో తనవంతు సాయం చేస్తూ ఉంటారు. లక్షల రూపాయలు దానం ఇస్తూ ఉంటారు. తాజాగా, చెన్నైని భారీ వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

వేల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. తినడానికి కూడా తిండి లేక అల్లాడిపోయారు. వరద పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కూడా పేద ప్రజల ఆకలి తీరే పరిస్థితి లేకపోయింది. ఇలాంటి సమయంలో పలువురు స్టార్‌ హీరోలు తమ వంతు సాయం ప్రకటించారు. సూర్య,కార్తీలు లక్షల రూపాయలు డొనేట్‌ చేశారు. ఆ తర్వాత విజయ్‌ కూడా చెన్నై వరదల్లో నష్టపోయిన వారికి సాయం చేయటానికి ముందుకు వచ్చారు. నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. కొంతమంది బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొంతమంది ఫ్యాన్స్‌ ఆయన్ని ఆశ్చర్యంతో పాటు షాక్‌కు కూడా గురి చేశారు. విజయ్‌ ప్రస్తుతం క్లీన్‌ సేవ్‌ లుక్‌లో ఉన్నారు. దీంతో కొంతమంది ఆయన్ని గుర్తు పట్టలేకపోతున్నారు. ఇంకా కొంతమంది మాత్రం నిత్యావరసరాల కోసం కంటే.. విజయ్‌తో ఫొటో దిగడానికే ఆసక్తి చూపుతున్నారు. ఓ ఫ్యాన్‌ తన కుటుంబంతో పాటు విజయ్‌ నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న చోటుకు వచ్చింది.

విజయ్‌ తన చేతుల్తో వస్తువులు ఇస్తుంటే తీసుకోలేదు. సెల్ఫీ దిగడానికి ఆసక్తి చూపింది. దీంతో విజయే స్వయంగా సెల్ఫీ తీశాడు. సెల్ఫీ దిగిన తర్వాత వాళ్లు సరుకులు తీసుకోకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో విజయ్‌ షాక్‌కు గురయ్యారు. ఆశ్చర్యంతో వాళ్లనే చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomcasibomgrandpashabetmeritbet girişgrandpashabet