ప్రపంచంలోని హిందూ దేవాలయాల్లో అత్యధికంగా భక్తులు సందర్శించే దేవాలయం, ఎంతోమందికి ప్రశాంతతని చేకూర్చే దేవాలయం, ఎక్కువ ఆదాయం కలిగిన దేవాలయం తిరుమల శ్రీవారి ఆలయం. రోజూ లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అంతమందికి దర్శనం కల్పించడం, ఉచితంగా అన్నప్రసాద వితరణ, ప్రసాదాలు.. ఇవే కాక ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తుంది TTD. TTDకి ఉన్న సమస్యల్లో ప్లాస్టిక్ ఒకటి. కొండపైకి వచ్చే లక్షలాది మంది భక్తుల వల్ల ప్లాస్టిక్ కూడా […]
ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్యని చంపేసి చెరువులో పడేసి అయిదు నెలలు ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేసిన సంఘటన అందర్నీ షాక్ కి గురిచేసింది. తిరుపతిలోని కొర్లగుంటకు చెందిన పద్మతో 2019లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ వేణుగోపాల్ కి వివాహం అయింది. కొన్ని రోజులు కాపురం బాగానే జరిగినా వివాహమైన నాలుగు నెలల నుంచి పద్మను చిత్ర హింసలకు గురిచేశాడు ఆమె భర్త. వేణుగోపాల్ వేధింపులు భరించలేక పద్మ తన పుట్టింటికి వెళ్లిపోయి భర్త నుంచి విడాకులు […]
శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త తెలిపింది. 2021 నవంబర్ లో భారీగా కురిసిన వర్షాలకు శ్రీవారి మెట్లమార్గం ధ్వంసమైన విషయం తెలిసిందే. ఆ మార్గానికి మరమ్మత్తులు చేపట్టిన టీటీడీ ఆ మార్గాన్ని వచ్చే నెల మొదటి నుంచి తెరుస్తోంది. భారీగా కురిసిన వర్షాలకు ధ్వంసమైన శ్రీవారి మెట్ల మార్గాన్ని ఐదునెలల నుంచి టీటీడీ మూసివేసింది. దానికి మరమ్మత్తులు చేపట్టింది. ఈక్రమంలో శ్రీవారి మెట్టు మార్గాన్ని మే 1 నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. శ్రీవారి మెట్ల […]
ఆపత్కాలంలో ప్రజాప్రతినిధులు తమలోని సామాజిక సేవా గుణాన్ని బయట పెడుతున్నారు. తమకు తోచిన సామాజిక సేవ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వైసీపీ సీనియర్ నేత తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికుడిగా మారారు. తెల్ల చొక్కా వదిలి ఖాకీ చొక్కా తొడిగి రోడ్లమీదకు వచ్చారు. రోడ్లను, పబ్లిక్ ప్లేస్ లో శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లారు కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు పరిశుభ్రత ఎంతో అవసరం అని చెబుతున్న నిపుణుల మాటలను భూమన […]
తిరుమల తిరుపతి దేవస్థానం బొక్కసం నుండి నగలు మాయమైన మాట వాస్తవమేనని అధికారులు నిగ్గు తేల్చారు. అదృశ్యమైన ఆభరణాలు పునఃపరిశీలనలో కూడా దొరకలేదని అధికారులు నిర్ధారించారు. దీనిపై టిటిడి అధికారులు శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆలయాలకు అనాదిగా భక్తులు మొక్కులు, కానుకల రూపంలో సమర్పించే ఆభరణాలను పరిశీలించి తిరువాభరణం (రికార్డు) లో నమోదు చేసి బొక్కసం (ట్రెజరీ) భద్రపరుస్తారు. అయితే 2016 లో బొక్కసం ఏఈఓ గా ఉన్న శ్రీనివాసులు బదిలీ […]
అంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) ఈ రోజు తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన విషయం తెలిసిందే. జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలనే దాదాపు ప్రస్తావించిన బీసీజీ ఆయా అంశాలను విసృత్త స్థాయిలో వివరించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి ప్రణాలికను రూపొందించింది. 13 జిల్లాలను ఆరు ప్రాంతాలుగా విభజించింది. ఆయా జిల్లాలు ఏఏ రంగాల్లో వెనుకబడ్డాయో గుర్తించి, ఆయా రంగాల్లో ఎలా అభివృద్ధి చేయాలో సూచించింది. […]