iDreamPost
android-app
ios-app

Korean Kanakaraju: కో.క..ఓ హర్రర్ కామెడీ

  • Published Aug 03, 2026 | 10:27 AM Updated Updated Aug 03, 2026 | 10:27 AM

వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' ట్రైలర్ విడుదలైంది. హర్రర్, కామెడీ, లవ్ స్టోరీ కలయికతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకోండి.

వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' ట్రైలర్ విడుదలైంది. హర్రర్, కామెడీ, లవ్ స్టోరీ కలయికతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకోండి.

Korean Kanakaraju: కో.క..ఓ హర్రర్ కామెడీ

ప్యూర్ హర్రర్ సినిమాలను కొందరే చూస్తారు. కానీ హర్రర్ కామెడీ అంటే ఎంతో మంది చూస్తారు. అందుకే ఈ జానర్ అంటే సినిమా మేకర్లకు అంత ఆసక్తి. ఈ జానర్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు. చాలా కాలంగా నిర్మాణంలో వున్న ఈ సినిమా జానర్ గురించి ఇటీవలే దర్శకుడు కొంత వరకు వెల్లడిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ట్రయిలర్ లో మొత్తం విప్పేసారు.

కియా మోటర్స్ లో పని చేసే కొరియన్ అమ్మాయిని లోకల్ రఫ్ అండ్ టఫ్ కుర్రాడు కనకరాజు ప్రేమించడం అన్నది ఒక ట్రాక్. ఆ కుర్రాడిని ఓ కొరియన్ భూతం ఆవహించడం అన్నది ఇంకో ట్రాక్. ఈ రెండు ట్రాక్ ల నుంచి వీలయినంత వినోదాన్ని పిండాలనుకున్నాడు దర్శకుడు మేర్లపాక గాంధీ. ఇక్కడ సినిమా స్క్రీన్ ప్లే ఎలా వుండబోతోందీ అన్నది ట్రయిలర్ లో కాస్త ఊహకు అందుతోంది. కనకరాజు అనేవాడి పరిచయం, ఆ తరువాత ప్రేమలో పడే పాట్లు..ఆపై దెయ్యం ఆవహించడం అన్నది ఒక భాగం గా కనిపిస్తోంది.

దెయ్యం లేదా భూతం ఎందుకు ఆవహించింది. అది ఎలా వదలింది..ఈ మధ్యలో దీని ఆధారంగా నడిచే ఫన్ సీన్లు ఏ మేరకు పండాయి..అదే టైమ్ లో లవ్ స్టోరీని మెయిన్ ప్లాట్ లో ఎలా మెర్జ్ చేసారు అన్న ట్రీట్ మెంట్ ను బట్టి సినిమా వుంటుంది.

ట్రయిలర్ వరకు ఓకె అనేట్లు వుంది. సత్య వుండడం వల్ల కామెడీ వర్కవుట్ అవుతుంది అనే ఫీల్ ను కలిగించింది ట్రయిలర్. వరుణ్ తేజ్ కు రెండు మూడు గెటప్ లు ట్రయ్ చేసారు. అవన్నీ స్క్రీన్ మీద కథలో పార్ట్ గా ఎలా వుంటాయి అన్నది చూడాలి. ట్రయిలర్ లో లవ్ ట్రాక్ ను పెద్దగా టచ్ చేయలేదు. విలన్ ట్రాక్ వుందని చూపించారు. ఈ టోటల్ భూతం ఎపిసోడ్ కు ఆ కొరియన్ అల్లావుద్దీన్ దీపం ఏ మేరకు కీలకం అన్నది తెలియాల్సి వుంది.

మొత్తం మీద కొరియన్ కనకరాజు ట్రయిలర్ నాట్ టూ గుడ్..నాట్ బాడ్..జస్ట్ వాచ్ చేయడానికి ఓకె.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet