Chiranjeevi
ఆగస్టు తొలి వారంలో టాలీవుడ్‌లో ఒకేసారి నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఈ రిలీజ్ క్లాష్ ఎలాంటి ప్రభావం చూపనుందో చూడాలి.
ఆగస్టు తొలి వారంలో టాలీవుడ్‌లో ఒకేసారి నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఈ రిలీజ్ క్లాష్ ఎలాంటి ప్రభావం చూపనుందో చూడాలి.
Chiranjeevi
వస్తే వరసపెట్టి రావడం లేదంటే వారం మొత్తం ఖాళీగా వదిలేయడం. ఇదే టాలీవుడ్ ట్రెండ్. ఎందుకు జరుగుతుందో తెలియదు. ఒక్కోవారం సినిమాలే వుండవు. లేదంటే ఒక్క సినిమా వస్తుంది. ఒక్కోసారి ఏకంగా నాలుగైదు సినిమాలు వచ్చి పడిపోతాయి. అగస్ట్ ఫస్ట్ వీక్ ది ఇదే పరిస్థితి. అరడజను సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయి. ఇప్పటికే స్పైడర్ మాన్ సినిమా థియేటర్లలో బలంగా వుంది. చెన్నయ్ లవ్ స్టోరీ కూడా వుంది. ఇప్పుడు కనీసం వస్తున్నాయి అని చెప్పుకోదగ్గ సినిమాలు నాలుగు వస్తున్నాయి. అంటే ఒకేసారి థియేటర్లలో అరడజను సినిమాలు వుంటాయి.
జనాలు ఏ సినిమా అని చూడాలి? బాగున్నది చూస్తారు..బాగాలేనిది వదిలేస్తారు అని చెప్పడం వరకు ఓకె. కానీ విడుదల చేసేది జనం రావాలనే కదా. దీక్షిత్ శెట్టి తో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోదరుడు హీరోగా చేసిన సినిమా కెజిక్యూ. ఈ థ్రిల్లర్ సినిమా ఏనాటి నుంచో మేకింగ్ లో వుంది. ఇప్పుడు విడుదలకు సిద్దం అయింది. వరుణ్ తేజ్ హీరోగా సినిమా వచ్చి చాలా కాలం అయింది. మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో యువి సంస్థ నిర్మించిన సినిమా కొరియన్ కనకరాజు రాబోతోంది ఈవారమే. ఒక విధంగా చెప్పాలంటే ఈవారం వస్తున్న పెద్ద సినిమా ఇదే. ఎక్కువ థియేటర్లను ఇదే ఆక్యుపై చేస్తుంది.
నక్కిన త్రినాధరావు చేతిలో హిట్ సినిమాలు వున్నా ట్రాక్ మాత్రం గొప్పగా లేదు. ఆయన చేసిన చిన్న సినిమా టైటిల్ అనకాపల్లి. ఈ సినిమా ఈవారం థియేటర్లలోకి వస్తోంది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తొలిసారి హీరోగా నటించిన సినిమా డి సి. తొలిసారి హీరోగా చేస్తున్నారు అంటే లోకేష్ అంత ఈజీగా తీసుకోరు. సమ్ థింగ్ వుంటుంది.
ఇలా నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి ఒకేసారి. అలా అని వచ్చేవారం కూడా తక్కువేమీ తినలేదు. అప్పుడు కూడా నాలుగైదు సినిమాలు రెడీ గా వున్నాయి విడుదలకు.