iDreamPost
android-app
ios-app

Allu Arjun: బన్నీకి ఇది కొత్త కాదుగా!

  • Published Aug 03, 2026 | 10:31 AM Updated Updated Aug 03, 2026 | 10:31 AM

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలో అల్లు అర్జున్ తన సన్నిహితులను నిర్మాణ భాగస్వాములుగా చేర్చుతున్నారనే ప్రచారం వైరల్ అవుతోంది. అయితే బన్నీకి ఇది కొత్త విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలో అల్లు అర్జున్ తన సన్నిహితులను నిర్మాణ భాగస్వాములుగా చేర్చుతున్నారనే ప్రచారం వైరల్ అవుతోంది. అయితే బన్నీకి ఇది కొత్త విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Allu Arjun: బన్నీకి ఇది కొత్త కాదుగా!

నిన్న ఉన్నట్లుండి సోషల్ మీడియా హోరెత్తింది. ఫ్రెండ్ షిప్ డే నాడు బన్నీ క్యాంప్ నుంచి వచ్చిన ఓ లీడ్ దానికి కారణం. బన్నీ-మైత్రీ మీడియా కాంబినేషన్ లో లోకేష్ కనకరాజ్ తో సినిమా రాబోతోంది. ఈ సినిమాకు బన్నీ తన మిత్రులు కొందరిని నిర్మాణ భాగస్వామ్యులను చేసారు. ఇదీ వైరల్ అయిన వార్త. స్నేహానికి బన్నీ ఇచ్చే విలువ ఇదీ అని.

అయితే బన్నీ ఇలా తన సినిమాల బ్యానర్లకు తన సన్నిహితులను జాయిన్ చేయడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా చేసారు. గతంలో ఓ సినిమాకు నాగబాబు పేరు జాయింట్ చేసారు. ఆ మేరకు నిర్మాత చేత కొంత ఫిక్స్ డ్ మొత్తాన్ని లాభం కింద నాగబాబుకు వెళ్లేలా చేసారు. అలాగే ఓ సినిమాకు తన మేనమామల పేర్లను జాయింట్ చేసారు. ఆ విధంగా వారికి కొంత మొత్తం వెళ్లేలా చేసారు. ఆ తరువాత మళ్లీ వారు సినిమాల వైపు రాలేదు. జస్ట్ ఆ సినిమా వరకే. ఆ విధంగా బన్నీ అవసరం లో వున్న తన వారిని ఆదుకున్నట్లు అయింది.

ఇప్పుడు మైత్రీ నిర్మించే సినిమాలో సహ నిర్మాతలుగా తన మిత్రుల పేర్లు జోడిస్తున్నారు. ఈసారి టెర్మ్స్ ఏమిటి అన్నది ఇంకా తెలియాల్సి వుంది. ఇలా పేర్లు వేసిన వారికి ఫిక్స్ డ్ మొత్తాలు ముందే డిసైడ్ చేసి అందిస్తారా? లేక లాభాల్లో ఏదో ఒక రేషియో అనుకుని అందిస్తారా? అవన్నీ ముందు ముందు తెలుస్తాయి. అది కూడా అధికారికంగా కాదు. గ్యాసిప్ లు గానే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet