అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ ఘట్టమనేని హీరోగా వచ్చిన 'శ్రీనివాస మంగాపురం' ఎలా ఉంది? పూర్తి రివ్యూ, ప్లస్, మైనస్, రేటింగ్ తెలుసుకోండి.
అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ ఘట్టమనేని హీరోగా వచ్చిన 'శ్రీనివాస మంగాపురం' ఎలా ఉంది? పూర్తి రివ్యూ, ప్లస్, మైనస్, రేటింగ్ తెలుసుకోండి.
Chiranjeevi
సమీక్ష – పెద్ద కుటుంబాల నుంచి వచ్చే హీరోలను తెరకు పరిచయం చేయడం అన్నది టఫ్ టాస్క్. అందులోనూ అలనాటి సూపర్ స్టార్ కృష్ణ ఇంటి నుంచి వచ్చే హీరోను పరిచయం చేయడం అంటే ఇంకా కష్టం. అప్పట్లో మహేష్ బాబును రాజకుమారుడు సినిమాతో ఇంట్రడ్యూస్ చేసారు. ఫక్తు ఫార్ములా కథే అది. హీరో పాటలు, ఫైట్లు, డ్యాన్స్, ఎమోషన్లు అన్నీ చేయగలడు అని చెప్పడం కోసమే అప్పట్లో ఇలాంటి లెగసీ హీరోల సినిమాలకు కథలు, సన్నివేశాలు రాసుకునేవారు.
కృష్ణ తనయుడు ముందుగా నీడ లాంటి ఆఫ్ బీట్ సినిమాతో పరిచయం అయినా, ఎన్ కౌంటర్ లాంటి డిఫరెంట్ సినిమా చేసినా, ఎక్కువ చేసింది కమర్షియల్ మాస్ సినిమాలే. మహేష్ బాబు వన్ టు పర్సంట్ తప్ప ప్రయోగాల జోలికి పెద్దగా వెళ్లలేదు. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన జయకృష్ణ కోసం ఇంచుమించి అలాంటి మాస్ మసాలా కథే ఎంచుకున్నారు దర్శకుడు అజయ్ భూపతి.
నిజానికి అజయ్ భూపతి బలం అంతా ఎమోషనల్ కంటెంట్ దగ్గరే వుంటుంది. కానీ ఫర్ ఏ ఛేంజ్ ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టి, ఓ కొత్త హీరోయిన్, హీరోలను తెరకు పరిచయం చేయడం కోసం ఏం చేయాలో అదే చేసారు. అది ఈ జనరేషన్ కు నప్పుతుందా..నప్పదా అన్నది పట్టించుకోకుండా. ఆ సినిమానే ఈవారం విడుదలైన శ్రీనివాసమంగాపురం.
ఈ సినిమా కథ తిరుపతిలో జరుగుతుంది. ఆ ఊరిని తన రౌడీయిజంతో గడగడలాడించే పెద్ది రెడ్డి (కిక్ శ్యామ్). అతని కూతురు మంగ (రష తడానీ)..బళ్లారిలో అధికారం చెలాయించే నాయుడు (మోహన్ బాబు) మనవడు వాసుబాబు అలియాస్ శ్రీను (జయకృష్ణ). ఈ ఇద్దరూ ప్రేమించుకుంటారు. సహజంగానే పెద్దల అడ్డంకి. చివరకు ఏమయింది. ఈ కథను ముందుకు నడపడం కోసం అటు పెద్ది రెడ్డి అంటే పడని గ్యాంగ్ ఒకటి. అలాగే నాయుడు అంటే పడని గ్యాంగ3్ ఇంకోటి. చివరకు ఏమయింది అన్నది సినిమా.
ఈ కథ వైనం కొత్తదేమీ కాదు. సినిమా పుట్టిన తరువాత ఇలాంటి కథలతో చాలా అంటే చాలా సినిమాలు వచ్చాయి. అందువల్ల హిందీ సినిమాకో, బెంగాలీ సినిమాకో అనుసరణ అని రంధ్రాన్వేషణ చేయక్కరలేదు.
సినిమా ఓపెనింగ్ షాట్ ఆసక్తికరంగా వుంటుంది. ఆ తరువాత కథ తిరుపతికి షిప్ట్ అవుతుంది. అక్కడ కూడా మంచి బలమైన సీన్ విలన్ వైనం, మనస్తత్వం, ఆలోచణాధోరణి పరిచయం చేయడం కోసం రాసుకున్నారు. అంతవరకు బాగానే వుంది. ఆ తరువాత హీరో హీరోయిన్ల నడుమ వచ్చే సన్నివేశాలు కానీ, తిరుపతిలో మరో విలన్ కోసం రాసుకున్న సీన్లు కానీ అంత బలంగా లేదా అంత కొత్తగా లేవు. హీరో హీరోయిన్ ట్రాక్ మరీ రొటీన్ గా వుంది.
విశ్రాంతి దగ్గర ఏదో సమ్ థింగ్ వుంటుందని ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ అనుకుంటున్నదే. అలాగే ఈ సినిమాలో కూడా కథను ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లే లీడ్ సీన్ వుంటుంది. అక్కడ నుంచి కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లడం, యాక్షన్ సీన్లు, లవ్ సీన్లు, ట్విస్ట్ లు, టర్న్ లు. ఆ తరువాత మళ్లీ వర్తమానం లోకి వచ్చి ముగియడం. సో..సో రెగ్యులర్ పాట్రన్ ఇది.
రెగ్యులర్ పాట్రన్ తో సమస్య కాదు. బలమైన, కొత్త తరహా రైటింగ్ పడితే సరిచేసుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో హీరో పక్కన ఓ కామెడీ బృందం వుండడం కామన్. కానీ ఆ పద్దతిని మాత్రం దూరం పెట్టారు. సీనియర్ నరేష్-శివాజీ లాంటి వెటరన్ నటులను తీసుకువచ్చి జోడించి కాస్త కామెడీ పిండాలని చూసారు. ఆ ట్రాక్ వేరుగా వుంటే ఏమో, ఈ కుర్రాడితో కలిపి వుంటే అతుకు సరిగ్గా పడినట్లు అనిపించదు. ఎంతయినా కుర్రాళ్ల ఫన్ కుర్రాళ్లదే కదా. అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఫ్లాష్ బ్యాక్ తెలియక ముందు నడిచిన లవ్ ట్రాక్ కూడా ఏమంత ఇంప్రెసివ్ గా లేదు. బలమైన భావోద్వేగాలు పండించడంలో చేయితిరిగిన అజయ్ భూపతి ఎందుకో అది వదిలేసినట్లు అనిపించింది. పాటలు, ఫైట్ల వరకు ఓకె. సన్నివేశాల్లో బలమైన మాటలు దొర్లలేదు. మరి దానికి అజయ్ భూపతి రీజన్ ఏమిటో తెలియాల్సి వుంది.
అటు బళ్లారి, ఇటు తిరుపతిల్లో సెట్ చేసిన టుమ్రీ విలన్ల ట్రాక్ లు కూడా చాలా బలహీనంగా వున్నాయి. అలాగే మోహన్ బాబు వెంకటప్పయ్య నాయుడు పాత్ర కూడా బలంగా లేదు. అటు ప్రేమకథ లో బలం లేక, ఇటు కుటుంబ నేపథ్యాల్లో బలం లేకపోయనపుడు సినిమా రక్తి కట్టడం కష్టం కదా. ఇక్కడ అదే జరిగింది. ఇలాంటి సినిమాకు సాంకేతిక సహకారం బాగా దొరికింది. జివి ప్రకాష్ కుమార్ నేపథ్యసంగీతం సినిమాకు ప్లస్ అయింది, సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ తో పెద్దగా సమస్య ఏమీ లేదు.
తొలిసారి తెరపైకి వచ్చిన జయకృష్ణ ఓకె అనిపించుకున్నాడు. ఫైట్లు బాగా చేసాడు. డ్యాన్స్ లు, లుక్ అంతా ఓకె. గొంతలో మెచ్యూరిటీ ఇంకా రావాలి. దానికి టైమ్ పడుతుంది. హీరోయిన్ కు పెద్దగా ప్లస్ మార్కులు ఏమీ పడవు. టోటల్ గా ఓ లెగసీ హీరో వర్క్ లు అన్నీ పరిచయం చేయడ వరకు ఈ సినిమా పనికి వస్తుందంతే.