iDreamPost
android-app
ios-app

తిరుపతి వెళ్లి వస్తుండగా.. గుండె పోటుతో 9ఏళ్ల బాలుడు మృతి

  • Published Feb 15, 2024 | 2:54 PM Updated Updated Feb 15, 2024 | 3:02 PM

జీవన శైలిలో మార్పులు కారణంగా.. మనిషి ఆరోగ్య పరంగా బలహీన పడిపోతున్నాడు. అందుకు ఉదాహరణ ఇటీవల పెరుగుతున్న గుండె పోటు మరణాలు. చిన్నా, పెద్ద అని వ్యత్యాసం లేకుండా దీనికి బలౌతున్నారు. తాజాగా జగిత్యాలలో విషాదం చోటుచేసుకుంది.

జీవన శైలిలో మార్పులు కారణంగా.. మనిషి ఆరోగ్య పరంగా బలహీన పడిపోతున్నాడు. అందుకు ఉదాహరణ ఇటీవల పెరుగుతున్న గుండె పోటు మరణాలు. చిన్నా, పెద్ద అని వ్యత్యాసం లేకుండా దీనికి బలౌతున్నారు. తాజాగా జగిత్యాలలో విషాదం చోటుచేసుకుంది.

  • Published Feb 15, 2024 | 2:54 PMUpdated Feb 15, 2024 | 3:02 PM
తిరుపతి వెళ్లి వస్తుండగా.. గుండె పోటుతో 9ఏళ్ల బాలుడు మృతి

చిట్టి హృదయం ఎంత పని చేస్తుంది. గుప్పెండత గుండె ఒక్కసారిగా ఆగిపోతూ.. ప్రాణాలను హరించేస్తుంది. చిన్నా, పెద్ద అని తేడా చూడటం లేదు. సామాన్యులు, సెలబ్రిటీలు అన్న వ్యత్యాసం లేదు దీనికి. ఉన్న పళంగా గుండెను మెలిపెట్టేసే నొప్పిని తెప్పించి తరలిరాని లోకాలకు తీసుకెళి పోతుంది. ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. చూస్తుండగానే మనుషులు హార్ట్ స్టోక్‌కు గురై.. చనిపోతున్నారు. చిన్న పిల్లల నుండి కాటికి కాలు చాపే ముదసలి వరకు అందర్ని తీసుకుపోతుంది ఈ హార్ట్ ఎటాక్. నిన్నటికి నిన్న ఖమ్మం జిల్లాలో ఓ బస్సు డ్రైవర్ డ్యూటీలో ఉండగానే.. గుండె పోటుకు గురై వాహనాన్ని నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ అతడు మాత్రం మృత్యువు నుండి తప్పించుకోలేకపోయాడు.

తాజాగా జగిత్యాలలో విషాదం చోటుచేసుకుంది. హార్ట్ ఎటాక్ అర్థం తెలియని.. చిన్న పిల్లవాడిని బలి తీసుకుంది ఈ మాయదారి రోగం. జగిత్యాల జిల్లాలోని థరూర్ గ్రామానికి చెందిన హర్షిత్ అనే 9 ఏళ్ల బాలుడు.. స్థానిక పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాడు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లాడు హర్షిత్. దర్శనం అనంతరం స్వగ్రామానికి బయలు దేరారు ఆ కుటుంబం. ఇంటికి చేరుకుంటున్నాం అనగానే.. హర్షిత్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. బాబు గుండె పోటుతో చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఆ గ్రామలోకూడా విషాద ఛాయలు అలముకున్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet