iDreamPost
android-app
ios-app

నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ.. ఈ సారి ఎంతంటే?

  • Published Sep 25, 2024 | 12:26 PM Updated Updated Sep 25, 2024 | 12:26 PM

Actor Mohanbabu: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఏదో ఒక కారణంతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు.. తాజాగా మంచు మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Actor Mohanbabu: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఏదో ఒక కారణంతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు.. తాజాగా మంచు మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Published Sep 25, 2024 | 12:26 PMUpdated Sep 25, 2024 | 12:26 PM
నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ.. ఈ సారి ఎంతంటే?

ఈ మధ్య కాలంలో ఎదో, ఒక కారణంతో సెలబ్రెటీలు.. పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇందులో మోసం చేసిన వారు కొందరైతే.. మనుషులను నమ్మి ఎదో ఒక విధంగా మోసపోయిన వారు కొందరు ఉంటున్నారు. తాజాగా ఇదే లిస్ట్ లోకి మంచు మోహన్ బాబు వచ్చి చేరారు. అందుతున్న సమాచారం మేరకు ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో భారీ చోరీ జరిగింది. జన్‌పల్లిలోని ఆయన ఇంట్లో పనిచేసే నాయక్ అనే వ్యక్తి రూ.10 లక్షలు దొంగతనం చేసి పారిపోయినట్లు మోహన్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు రాచకొండ సీపీకి ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన దర్యాప్తు చేపట్టి తిరుపతిలో నాయక్ ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. 2019లో ఇదే తరహాలో ఫిలిమ్ నగర్ లో ఆయన ఇంట్లో పని చేస్తున్న పనిమనిషి డబ్బులు, నగలు దొంగిలించినట్లు మోహన్ బాబు కుటుంబ సభ్యులు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

నిజానికి మోహన్ బాబు.. తన వద్ద పని చేసే మనుషులను సొంత వారిగా భావిస్తూ ఉంటారు. అంత నమ్మకం ఉంది కాబట్టే.. సిటీకి దూరంగా మంచి ఇల్లు కట్టుకుని అక్కడ జీవిస్తున్నారు. మోహన్ బాబు కాంపౌండ్ లోనే.. పనివారికి కూడా అన్నీ సౌకర్యాలతో నివాసాలు ఏర్పాటు చేశారు. వారంతా ఎన్నో ఏళ్లుగా వీరి కుటుంబాన్ని నమ్ముకుని జీవిస్తూ వస్తున్నారు. ఇంత మంచిగా చేసుకుంటున్నా.. అప్పుడప్పుడు పని వారు ఇలా దొంగతనాలు చేయడంపై మోహన్ బాబు కుటుంబం అంతా షాక్ కి గురి అవుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీ జీవితం గడపాలని చూస్తున్నారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్, డ్రగ్స్ దందా ఇలా ఎన్నో రకాలు మోసాలకు పాల్పపడుతూ లక్షలు సంపాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో దిగ్గజ నటుడైన మోహన్ బాబు.. పనివారిపై ఆధారపడి.. సిటీకి దూరంగా ఉండటంతో.. ఇప్పుడు ఫ్యాన్స్ ఆయన రక్షణపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి ఎంతో సెక్యూరిటీతో కనిపించే సినీ తారలకు తమ ఇంట్లో పనిమనుషులు, ఇతర సిబ్బంది చేతి వాటం తిప్పలు తప్పడం లేదు. గతంలో మంచు మోహన్ బాబు ఇంట్లోనే చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఇక.. కొన్ని నెలల క్రితం రజనీకాంత్ కుమార్తెకి కూడా ఇదే తలనొప్పి ఎదురైంది. అప్పట్లో ఈ విషయంలో పెద్ద రాద్దాంతమే జరిగింది. తాజాగా మరోసారి కూడా మోహన బాబు బాధితుడు అయ్యారు. ఇక దొంగతనం చేసిన నాయక్ అనే వ్యక్తి .. ఎప్పటి నుండి మంచు కుటుంబం వద్ద పని చేస్తున్నాడన్న విషయం తెలియరాలేదు. అతని నుండి ఎంత డబ్బు రికవరీ చేశారు అనేది కూడా తెలియాల్సి ఉంది. తన కాలేజీల ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న మంచు కుటుంబంలో ఇలాంటి చోరీ జరగడం మాత్రం అందరినీ ఆందోళనకి గురి చేస్తుంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet