iDreamPost
android-app
ios-app

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి సమంత.. వీడియో వైరల్

  • Published Mar 04, 2024 | 4:37 PM Updated Updated Mar 04, 2024 | 5:19 PM

Samantha Visits Tirumala Temple: తిరుమల శ్రీవారిని ప్రముఖ నటి సమంత దర్శించుకున్నారు.. సోమవారం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆమె శ్రీ వెంకటేశ్వరస్వామివారి సేవలో పాల్గొన్నారు.

Samantha Visits Tirumala Temple: తిరుమల శ్రీవారిని ప్రముఖ నటి సమంత దర్శించుకున్నారు.. సోమవారం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆమె శ్రీ వెంకటేశ్వరస్వామివారి సేవలో పాల్గొన్నారు.

  • Published Mar 04, 2024 | 4:37 PMUpdated Mar 04, 2024 | 5:19 PM
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి సమంత.. వీడియో వైరల్

తిరుమల పుణ్య క్షేత్రానికి ప్రతిరోజూ లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. స్వామి వారి సేవలో పాల్గొని పూజలు, అభిషేకాలు చేయిస్తుంటారు. తిరుమల దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం అని.. ఏలిన నాటి శని తొలగిపోతుందని భక్తుల నమ్మకం. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు నిత్యం శ్రీ వెంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం తరలివస్తుంటారు. సినీ, రాజకీయ, క్రీడా, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు స్వామి వారి సేవలో పాల్గొని తరిస్తుంటారు. ప్రముఖ నటి సమంత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ నటి సమంత సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. తన వ్యక్తిగత సిబ్బందితో విచ్చేసిన సమంత వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకున్నారు. టీటీడీ అధికారులు ఆమెకు దర్శన ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం సమంత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకొని పుష్పాంజలి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనాంతరం ఆలయ అర్చకులు సమంతకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో ఆమెను సత్కరించి తీర్థ ప్రసాదాలు అంజేశారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం సమంత ఆలయం వెలుపలికి వచ్చారు. సమంత రాకతో పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది.. సమంతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. తనకు తిరుమల అంటే ఎంతో ఇష్టమని.. స్వామి వారి దర్శనానికి గతంలో పలుమార్లు వచ్చానని.. శ్రీవారిని దర్శించుకుంటే ఎంతో ఆనందంగా, మనసు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు.

2010లో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘ఏం మాయ చేశావే’ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిగా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నటించి బిజీ హీరోయిన్ గా మారిపోయింది. సినిమాల్లోనే కాదు.. వెబ్ సీరీస్ లో కూడా తన సత్తా చాటింది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ బీజీ లైఫ్ గడిపింది. అంతలోనే మయోసైటీస్ వ్యాధితో ఇండస్ట్రీకి కొంతకాలం బ్రేక్ ఇచ్చింది. ఇటీవల సమంత ఎక్కువగా భక్తి మార్గంలో పయనిస్తుంది.. క్రమంలోనే పలు ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే సోమవారం ఆమె తిరుమల దర్శనం చేసుకుంది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom